…భారత్ న్యూస్ హైదరాబాద్….కాంగ్రెస్ ప్రభుత్వం రిటైర్డ్ అయిన 6000 మంది ప్రభుత్వ ఉద్యోగులకు రిటైర్మెంట్ డబ్బులు చెల్లించడం లేదు.

ఉద్యోగులకు రిటైర్మెంట్ బెనిఫిట్స్ మూడు సంవత్సరాల తర్వాతే చెల్లిస్తాం అనడం దుర్మార్గం.

ఒక డీఏ మాత్రమే ప్రకటించి ప్రభుత్వ ఉద్యోగులను నిరాశపరిచారు.

బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో 15 డీఏలను ఉద్యోగులకు ఇచ్చాము.
…………………………………….

సిద్దిపేటలో ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా పనిచేసి పదవీ విరమణ పొందిన మన్మోహన్ వీడ్కోలు కార్యక్రమానికి ముఖ్యతిథిగా హాజరైన మాజీ మంత్రి హరీశ్‌రావు

ఈ సందర్భంగా హరీశ్‌రావు మాట్లాడుతూ :

పదవీ విరమణ పొందిన మన్మోహన్‌‌కు శుభాకాంక్షలు. మన్మోహన్ నాకు కేసీఆర్ కుటుంబానికి ఎంతో ఆత్మీయులు.

ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా పనిచేసిన వారి జీతాల నుండి కొంత భాగాన్ని కట్ చేసి.. ప్రభుత్వం రిటైర్డ్ అయినప్పుడు ఇచ్చే మీ రిటైర్మెంట్ బెనిఫిట్స్‌ను కాంగ్రెస్ ప్రభుత్వం ఇవ్వడం లేదు.

రిటైర్మెంట్ అయిన చివరిరోజే రిటైర్మెంట్ డబ్బులు ఇవ్వాలి. కానీ, ఇప్పుడు రెండు, మూడు సంవత్సరాలు అయినా అందే పరిస్థితి లేదు.

డీఏలు కూడా రెండు వస్తాయేమో అనుకుంటే.. కేవలం ఒక్క డీఏ మాత్రమే ఇచ్చి ప్రభుత్వ ఉద్యోగులను నిరాశపరిచింది ఈ ప్రభుత్వం.

గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో 15 డీఏలను ప్రభుత్వ ఉద్యోగులకు ఇచ్చాము.

కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి 6,000 మంది ఉద్యోగులు రిటైర్ అయ్యారు. కానీ వారికి కాంగ్రెస్ ప్రభుత్వం రిటైర్మెంట్ డబ్బులు ఇంకా ఇవ్వలేదు.

ప్రభుత్వ ఉద్యోగులుగా రిటైర్డ్ అయిన తర్వాత వచ్చే డబ్బుతో వారు చేయాల్సిన బాధ్యతను, వారి అవసరాలను ప్లాన్ చేసుకుంటారు. ఈ ప్రభుత్వం పెట్టాడు ఉద్యోగులను తీవ్రంగా ఇబ్బంది పెడుతుంది.

ఉద్యోగుల 20, 30 సంవత్సరాల కష్టార్జితాన్ని రిటైర్మెంట్ సమయంలో ప్రభుత్వం ఇవ్వకపోవడం దురదృష్టకరం.

బీఆర్ఎస్ ప్రభుత్వంలో రిటైర్మెంట్ అయిన చివరిరోజే రిటైర్మెంట్ డబ్బులు ఉద్యోగుల చేతికి వచ్చేది. కానీ, ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. ఎప్పుడు వస్తాయో కూడా తెలియని పరిస్థితి నెలకొన్నది.

కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటికైనా ఉద్యోగులకు ఇవ్వాల్సిన రిటైర్మెంట్ బెనిఫిట్స్‌ను వెంటనే విడుదల చేయాలి.