..భారత్ న్యూస్ హైదరాబాద్….ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ నేలపై 50 అడుగుల భారీ చిత్రం!
మెదక్, నవంబర్ 08
కళాకారులు 20 గంటలకు పైగా శ్రమించిన ఈ చిత్రం వద్ద ఫోటోలు దిగేందుకు సందర్శకులు పోటీపడ్డారు…
తెలంగాణా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జన్మదినం సందర్భంగా మెదక్ లోని ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రాంగణంలో భారీ చిత్రపటం చిత్రించారు.
“హ్యాపీ బర్త్ డే రేవంత్ అన్న” అని రాసి శుభాకాంక్షలు తెలుపారు
ఈ భారీ రంగోలి చిత్రాన్ని కాంగ్రెస్ నాయకులు మైనం పల్లి హనుమంత్ రావు, మైనంపల్లి రోహిత్ రావు ఏర్పాటుజేశారు.
ప్రఖ్యాత భారీ రంగోలీ చిత్రకారుడు పురుషోత్తం మరో నలుగురు సహాయకులతో రూపుదిద్దారు.