భారత్ న్యూస్ హైదరాబాద్….ధాన్యం కొనుగోళ్ల ప్రక్రియ సాఫీగా సాగాలి : సీఎం రేవంత్
రాష్ట్రవ్యాప్తంగా ధాన్యం కొనుగోళ్ల ప్రక్రియ సాఫీగా సాగేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు.
అన్ని జిల్లాల్లో వెంటనే కొనుగోళ్లు ప్రారంభించి రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అవసరమైన ఏర్పాట్లు చేయాలని సీఎం ఆదేశించారు.
ప్రత్యేక అధికారులు కొనుగోలు కేంద్రాలను సందర్శించి రైతులకు ఏమైనా సమస్యలు ఉంటే అక్కడికక్కడే పరిష్కరించాలని ముఖ్యమంత్రి సూచించారు.