భారత్ న్యూస్. హైదరాబాద్. శ్రీరాముని దివ్య చరిత్రను సంపూర్ణ మానవాళికి అందించిన సంస్కృత ఆదికవి మహర్షి వాల్మీకి గారి జయంతి సందర్భంగా ఆ మహాపురుషుడిని స్మరించుకుంటూ రాచకొండ కమిషనర్ శ్రీ సుధీర్ బాబు ఐపీఎస్ గారు ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా కమిషనర్ గారు మహర్షి వాల్మీకి గారి చిత్ర పటాన్ని పూలమాలలతో అలంకరించి శ్రీరాముని దివ్య చరిత్రను రామాయణ మహాకావ్యంగా మలిచి జాతికి సన్మార్గాన్ని నిర్దేశించిన మహోన్నతులు అని కొనియాడారు. ఈ కార్యక్రమంలో అడ్మిన్ డీసీపీ ఇందిర మరియు ఇతర సిబ్బంది పాల్గొన్నారు.