భారత్ న్యూస్ హైదరాబాద్….X వేదికగా ప్రధాని మోదీకి సీఎం రేవంత్ రెడ్డి కౌంటర్..

తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీని అమలు చేస్తున్నాం

మహిళలకు ఉచిత ఆర్టీసీ బస్సు విజయవంతంగా అమలు చేశాం

దేశంలో ఎక్కడా లేని విధంగా 22 లక్షల 22 వేల మంది రైతులకు రూ.2 లక్షల చొప్పున రుణ మాఫీ చేశాం

రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకాన్ని రూ.10 లక్షలకు పెంచాం

200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ అందిస్తున్నాం

బీజేపీ పాలిత రాష్ట్రాల్లో గ్యాస్ ధరలు మండుతుంటే.. తెలంగాణలో రూ.500లకే గ్యాస్ సిలిండర్ అందిస్తున్నాం

నిరుద్యోగ యువత కోసం ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేస్తున్నాం

చెరువులు, నాలాలు వంటి నీటి వనరులను సంరక్షించే చర్యలు చేపట్టాం

ఫ్యూచర్ సిటీ నిర్మాణానికి మాస్టర్ ప్లాన్ సిద్ధం చేశాం