భారత్ న్యూస్ హైదరాబాద్….శంషాబాద్ విమానాశ్రయంలో రూ. 7 కోట్ల విలువైన డ్రగ్స్ పట్టివేత

శంషాబాద్ విమానాశ్రయంలో డీఆర్ఐ అధికారులు రూ.7 కోట్ల విలువైన డ్రగ్స్ ను స్వాధీనం చేసుకున్నారు.

బ్యాంకాక్ నుంచి హైదరాబాద్ కు డ్రగ్స్ సరఫరా చేస్తున్నారని ఇంటెలిజెన్స్ సిబ్బంది డీఆర్ఐ అధికారులకు సమాచారం ఇచ్చారు.

దీంతో అప్రమత్తమైన అధికారులు ఇద్దరిని అదుపులోకి తీసుకొని వారి నుంచి రూ.7 కోట్లు విలువ చేసే మాదకద్రవ్యాలను అధికారులు స్వాధీనం చేసుకున్నారు.

వారిపై ఎన్డీపీఎస్ చట్టం కింద కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.