భారత్ న్యూస్.హైదరాబాద్
9వ జాతీయ ఆయుర్వేద దినోత్సవం సందర్భంగా ఎర్రగడ్డలోని ఆయుర్వేద మెడికల్ కాలేజీలో నిర్వహించిన కార్యక్రమంలో ఆరోగ్యశాఖ మంత్రి దామోదర్ రాజ నర్సింహా గారు పాల్గొన్నారు.
ఇటీవల ప్రభుత్వం నియమించిన 628 మంది పార్ట్ టైమ్ యోగా ఇన్‌స్ట్రక్టర్లకు మంత్రి అపాయింట్‌మెంట్ లెటర్లు అందించారు.
మంత్రి స్పీచ్ పాయింట్లు:
ఆయుర్వేదం, యోగా మన వేద జ్ఞానం.
ప్రకృతితో మమేకమై ఎలా జీవించాలో పూర్వీకులు మనకు నేర్పించారు.
కానీ, మనం దాన్ని కొనసాగించలేకపోయాం.
యోగా, ఆయుర్వేదం మతానికి సంబంధించిన అంశాలు కాదు. మానవాళికి సంబంధించిన అంశం. మానవశరీరం, జ్ఞానం, మనస్సుకు సంబంధించిన అంశం.
ఇప్పుడిప్పుడే దీనియొక్క ప్రాముఖ్యతను ప్రజలు అర్థం చేసుకుంటున్నారు.
పిల్లలకు దీన్ని నేర్పించాలి.
యోగా, ఆయుర్వేదను గ్రామాల్లోకి తీసుకెళ్లాలి.
యోగా వల్ల కలిగే లాభాలు ఏంటో ప్రజలకు వివరించి, వారికి అవగాహన కల్పించాలి.
ఆయుష్ డైరెక్టరేట్‌ను , డ్రగ్స్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ డైరెక్టరెట్ లు విభజనను ఆంధ్రకి వెళ్ళాయి.
ఆయుష్ శాఖను బలోపేతానికి కృషి చేస్తున్నా ము.
అల్లోపతి లాగే ఆయుర్వేదానికి పెద్దపీట వేస్తున్నాము.
ప్రాచీన యోగ, సిద్ధ యోగ లు నిర్లక్ష్యానికి గురయ్యాయి.
మన పూర్వికులు వందల సంవత్సరాల క్రితమే ప్రకృతిలోని రహస్యాలను ఛేదించి మానవాళికి అందించారు.
యోగ అద్భుతాలను భవిష్యత్ తరాలకు అందించాలి.
హైదరాబాద్, వరంగల్‌లోని కాలేజీల్లో ఆయుష్ యూజీ, పీజీ సీట్ల సంఖ్యను పెంచుతాం.
స్టూడెంట్ల కోసం కొత్త హాస్టల్ భవనాలను నిర్మిస్తాం.
వారం రోజుల్లో విద్యార్థుల స్టైఫండ్ చెల్లిస్తాం.
స్టైఫండ్ పెంపు అంశాన్ని పరిశీలిస్తాం.
ఇంకో 214 మంది యోగా ఇన్‌స్ట్రక్టర్లను త్వరలో నియమిస్తాం.
ప్రపంచమంతా యోగా, ఆయుర్వేదను గౌరవిస్తోంది. ఆదరిస్తోంది. మనం కూడా ఈ విభాగాన్ని అభివృద్ధి చేసుకోవాలి.
క్రిస్టినా, హెల్త్ సెక్రటరీ:
1935లో ఆయుర్వేద కాలేజీ ఏర్పడింది.
421 ఆరోగ్య మందిర్స్‌లో యోగా టీచర్లను నియమించాం.
ప్రజలు ఈ సదుపాయాన్ని ఉపయోగించుకోవాలి. పిల్లలకు యోగా అలవాటు చేయాలి.
ఆరోగ్య మందిర్స్‌లో యోగా ఇన్‌స్ట్రక్టర్లు ఉచితంగా యోగా నేర్పిస్తారు.
కార్యక్రమ అనంతరం ఆయుర్వేద కాలేజీ, హాస్పిటల్‌ను మంత్రి పరిశీలించారు. పేషెంట్లతో మాట్లాడి, హాస్పిటల్‌లో ఉన్న సౌకర్యాలపై ఆరా తీశారు. అన్ని విభాగాలను క్షేత్రస్థాయిలో పరిశీలించారు.