..భారత్ న్యూస్ హైదరాబాద్….అవసరం లేని చోట మూడున్నర కోట్లతో వంతెన మంజూరు
ఆదిలాబాద్ పట్టణం నుండి రాంపూర్ గ్రామానికి వెళ్లే దారి మధ్యలో ఒక చిన్న పిల్ల కాలువ ఉంది.. ఆ పిల్ల కాలువ మీద రూ.3.50 కోట్లతో వంతెన మంజూరు చేశారు.
ఆ వంతెన మీద నుండి వెళ్తే ఒకరి పొలం దగ్గరికి వెళ్లొచ్చు. ఒకవేళ కాలువ నిండినా 2 కిలోమీటర్లు తిరిగి వెళ్ళే దారి ఉంది.. అనవసరంగా ఎలాంటి జనావాసం లేని దగ్గర రూ.3.50 కోట్లు పెట్టి వంతెన కట్టడం ఎందుకని, ఆ పొలం ధర పెంచడానికే పలుకుబడితో ఇలా చేస్తున్నారని ప్రభుత్వంపై ప్రజలు మండిపడుతున్నారు….