…భారత్ న్యూస్ హైదరాబాద్…కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు శుభవార్త!!
పంచాయతీ రాజ్, గ్రామీణ శాఖల్లో పనిచేస్తున్న కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు రెగ్యులర్ జీతాలు ఇవ్వాలని అధికారులను మంత్రి సీతక్క ఆదేశించారు.
ఆన్-లైన్లో ఏకకాలంలో జీతాల చెల్లింపు జరిగేలా కొత్త విధానాన్ని తీసుకురానున్నట్లు సమాచారం.
దీంతో ప్రభుత్వ ఉద్యోగుల మాదిరిగానే వీరికీ ప్రతి నెలా ఒకటో తేదీన వేతనాలు అందే అవకాశం ఉంటుంది.
ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫైల్ ఆర్థికశాఖ వద్ద పెండింగ్లో ఉంది..