భారత్ న్యూస్ హైదరాబాద్….మావోయిస్టుల‌ లేఖ కలకలం.. బీఆర్ఎస్‌కు వార్నింగ్‌!

ఈ లేఖ‌పై పోలీసులు ద‌ర్యాప్తు చేప‌ట్టారు.

జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో మావోయిస్టు లేఖ కలకలం రేపుతోంది.

బీఆర్ఎస్‌ నేతలకు వార్నింగ్ ఇస్తూ లేఖ విడుదల చేశారు.

మావోయిస్టు పార్టీ అధికార ప్రతినిధి జగన్ పేరుతో లేఖ విడుదలైంది.

గత బీఆర్ఎస్ ప్రభుత్వ హాయంలో దళిత బంధు పేరుతో ప్రజలను మోసం చేశారని లేఖలో మావోయిస్టులు పేర్కొన్నారు.

ద‌ళితుల వ‌ద్ద ల‌క్ష‌ల రూపాయ‌లు వ‌సూలు చేశార‌ని బీఆర్ఎస్ మాజీ ప్రజాప్రతినిధులు, పార్టీ మండల అధ్యక్షుల పేర్లను లేఖలో పేర్కొన్నారు.