భారత్ న్యూస్ విజయవాడ….ఇందిరమ్మ ఇళ్లపై మంత్రి పొంగులేటి కీలక వ్యాఖ్యలు.

ఇందిరమ్మ ఇళ్లపై మంత్రి పొంగులేటి కీలక వ్యాఖ్యలు
తెలంగాణలో లబ్దిదారులకు ఈనెల ఆఖరులోపు ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేస్తామని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు.

గ్రామసభల ద్వారా ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులను ఎంపిక చేస్తామని తెలిపారు. BRS నాయకుల లాగా బకాసురులను ఎంపిక చేయమని చెప్పారు.

మాజీ మంత్రి ఎర్రబెల్లి కక్కుతున్న విషం ప్రజలు గమనిస్తున్నారని విమర్శించారు. తప్పు చేస్తే పేద వాడిని ఇబ్బంది పెడితే.. కాపలాలాగా ఇందిరమ్మ ప్రభుత్వం ఉంటుందని హామీ ఇచ్చారు.