కస్తూర్బా. విద్యాలయంలో 13 మంది విద్యార్థినులు అస్వస్థత,…భారత్ న్యూస్ హైదరాబాద్…
సంగారెడ్డి జిల్లా న్యాలకల్ కస్తూర్బా విద్యాలయంలో 13 మంది విద్యార్థినులు దగ్గు, శ్వాస సంబంధిత సమస్యతో అస్వస్థతకు గురయ్యారు.. విద్యార్థినులను పాఠశాల సిబ్బంది జహీరాబాద్ ఏరియా ఆసుపత్రికి తరలించారు.
8 మంది విద్యార్థినుల ఆరోగ్యం నిలకడగా ఉండగా, ముగ్గురికి దగ్గు తీవ్రంగా ఉంది.
విద్యార్థినుల తల్లిదండ్రులు ఆస్పత్రి దగ్గర ఆందోళన చెందుతున్నారు.
పాఠశాలలో గోడలకు రంగలు వేయగా, ఆ వాసనతో విద్యార్థినులు అస్వస్థతకు గురై ఉండొచ్చని డాక్టర్లు తెలిపారు….