భారత్ న్యూస్ హైదరాబాద్…ఇందిరా గాంధీ చిత్ర పటానికి ఘన నివాళులర్పించిన వరంగల్ ఎంపీ డాక్టర్ కడియం కావ్య..
హనుమకొండ జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మాజీ ప్రధాని ఇందిరా గాంధీ వర్ధంతి సందర్భంగా వారి చిత్రపటానికి వరంగల్ పశ్చిమ శాసన సభ్యులు నాయిని రాజేందర్ రెడ్డి,వర్ధన్నపేట ఎమ్మెల్యే కె ఆర్ నాగరాజు, ఎమ్మెల్సీ బసవరాజు సారయ్య, వరంగల్ డీసీసీ అధ్యక్షురాలు ఎర్రబెల్లి స్వర్ణ గార్లతో కలిసి వరంగల్ పార్లమెంట్ సభ్యురాలు డాక్టర్ కడియం కావ్య పూలమాల వేసి, నివాళులర్పించారు.
ఈ సందర్భంగా ఎంపీ డా.కడియం కావ్య గారు మీడియాతో మాట్లాడుతూ… ప్రజాస్వామ్యంలో అనేక సంస్కరణలు చేసి ప్రజాహిత నిర్ణయాలు తీసుకొని ఈ దేశ ప్రజలకు అమ్మగా ఇందిరా గాంధీ చిరస్మరణీయం అని పేర్కొన్నారు. ఈరోజు యువత ముఖ్యంగా మహిళలు ఆత్మస్థైర్యం కోల్పోకుండా ఏ విధంగా తమ తమ రంగాల్లో వృత్తి వ్యవహారపరంగా ఎలా ఉండాలో మరియు నవతర రాజకీయ నాయకులకు ఇందిరమ్మ ఆదర్శమన్నారు. దేశ ఐక్యత కోసం జాతీయ భావం, అభివృద్ధి పేదల పట్ల పూర్తి శ్రద్ధ అన్ని రకాల అంశాలను ప్రాధాన్యత ఇచ్చిన ఇందిరా గాంధీ స్ఫూర్తి ప్రపంచ స్థాయిలో నిలిచిన నాయకురాలు అని కొనియాడారు. ఇప్పటికి ఇందిరమ్మ రాజ్యం కొనసాగుతుందని, ఇందిరమ్మ లాంటి నాయకురాలు ఆమె ఇచ్చిన స్ఫూర్తి ఈ దేశ యువత ఆదర్శంగా తీసుకోవాలని ఎంపీ అన్నారు.
ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, సీనియర్ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.