భారత్ న్యూస్ హైదరాబాద్…కెనడాలో ఐక్యం అయిన హిందువులు!

ఖలిస్థానీలకు వ్యతిరేకంగా హిందువులు రోడ్లమీదకు రావడంతో వివాదం మరో టర్న్ తీసుకుంది..

బ్రాంప్టన్ ఆలయం వద్దకు వందలాది హిందువులు.. జైశ్రీరామ్ నినాదాలు

బ్రాంప్టన్ హిందూ సభా మందిరంపై ఖలిస్థానీల దాడులు కెనడాలో హిందువులను సంఘటితం చేస్తున్నట్టు కనిపిస్తోంది.

విషయం తెలియగానే వందల సంఖ్యలో వారు ఆలయం వద్దకు చేరుకున్నారు.

‘మనమంతా ఒక్కటవ్వాలి’ అంటూ అక్కడి పూజారి పిలుపునిచ్చారు.

జాతీయ పతాకంతో పాటు కాషాయ జెండాలు చేతబూనిన ప్రజలు ‘జై శ్రీరామ్’ అంటూ నినాదాలు చేశారు.