.భారత్ న్యూస్ హైదరాబాద్….మూసి బాధితులకు అండగా బిజెపి మహా ధర్నా

పాల్గొన్న మహిళా మోర్చా ఉపాధ్యక్షురాలు విజయలక్ష్మి

హైదరాబాద్ అక్టోబర్ 25

రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డాక మూసి సుందరీకరణ, పునర్జీవం పేరుతో పేదల ఇళ్లను కూల్చి వేస్తున్నారు. ఈ సందర్భంగా వారికి బిజెపి అండగా నిలుస్తూ ఈరోజు ఉదయం ఇందిరా పార్క్ ధర్నా చౌక్ వద్ద మూసి బాధితులకు అండగా బిజెపి మహాధర్నా కార్యక్రమం నిర్వహించింది.
ఈ సందర్భంగా ధర్నాలో పాల్గొన్న నాయకులు మాట్లాడుతూ రాష్ట్రం లో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డాక అభివృద్ధి చేయాల్సింది పోయి, హైడ్రా, సుందరీకరణ పేరుతో ఇళ్ళు కూల్చుకుంటూ వెళుతున్నారని, ప్రజా వ్యతిరేక నిర్ణయాలు తీసుకుంటున్నారన్నారు.
పేద,మధ్యతరగతి వర్గాలు బాధపడుతున్నాయని, వారికీ భరోసా కల్పించేందుకే ధర్నా కార్యక్రమం చేపట్టామన్నారు.
ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్,ఎంపీ ఈటల రాజేందర్,మహిళా నేతలు, కార్యకర్తలు,మూసి బాధితులు, తదితరులు పాల్గొన్నారు.