.భారత్ న్యూస్ హైదరాబాద్…రేవంత్ సర్కార్ మరో శుభవార్త.. ఇక నుంచి ప్రతి జిల్లాకో మార్కెట్!

మోడల్ మార్కెట్ల ఏర్పాట్లతో అటు రైతులతో పాటు ప్రజలకు కూడా లబ్ధి చేకూరుతుందని మంత్రి అభిప్రాయపడ్డారు.

తెలంగాణ రాష్ట్రంలోని జిల్లాలకు రేవంత్ రెడ్డి సర్కార్ శుభవార్త వినిపించింది.

ఈ మేరకు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు కీలక ప్రకట చేశారు.

ఆధునిక అవసరాలను దృష్టిలో పెట్టుకుని.. ప్రయోగాత్మకంగా ప్రతి జిల్లాకు ఒక మోడల్ మార్కెట్ ఏర్పాటు చేయబోతున్నామని మంత్రి తుమ్మల ప్రకటించారు.

అందుకోసం ప్రతిపాదనలు సిద్ధం చేయాలని అధికారులను మంత్రి ఆదేశించారు.