భారత్ న్యూస్. హైదరాబాద్ : డ్రగ్స్‌ కట్టడిపై దృష్టి పెట్టండి..

  • నాన్‌ డ్యూటి పెయిడ్‌ లిక్కర్‌పై కఠినంగా వ్యవహరించండి.

•రంగారెడ్డి ఎక్సైజ్‌ అధికారుల సమీక్షా సమావేశంలో డిప్యూటి కమిషనర్‌ పి.దశరథ్‌

రంగారెడ్డి ఎక్సైజ్‌ పరిధిలో ఎక్సైజ్‌, డి టి ఎఫ్ (జి ల్లా టాస్క్‌ ఫోర్స్‌) టీమ్‌లు పటిష్టంగా పని చేస్తు గట్టి నిఘా పెంచి డ్రగ్స్‌పై, నాన్‌ డ్యూటి పెయిడ్‌ లిక్కర్‌ ఉక్కు పాదం మోపాలని డిప్యూటి కమిషనర్‌ పి.దశరథ్‌ అదేశించారు.

మంగళవారం అబ్కారీ భవన్‌లో రంగారెడ్డి జి ల్లాలో పరిధిలోని ఎక్సైజ్‌ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు.

సెప్టెంబ రు నెలలో ఎక్సైజ్‌ అధికారులు, స్టేషన్‌ పనితీరు సంతృప్తికరంగా ఉన్నా కూడ మరింతగా కృషీ చేయాల్సిన అవసరముందాన్నారు.

సెప్టెంబ రులో నాటుసారా తయారీ కేంద్రాలపై దాడులు నిర్వహించి 56 కేసులు నమోదాు చేసి 53 మందిని అరెస్టు చేసి 111 లీటర్లను స్వాధీనం చేసుకున్నారని అన్నారు.
నాటుసారాను పూర్తి స్థాయిలో అరికట్టాలనే ఉన్నతాధికారుల మేరకు మరింతగా పని చేసి నాటుసారా తయారీ, అమ్మకాలు, రవాణాలేకుండా చేయాలన్నారు.

జి ల్లాలో మూడు కేసుల్లో ఏడుగురిని అరెస్టు చేసి 81 లీటర్ల నాన్‌ డ్యూటి పెయిడ్‌ లిక్కర్‌ను స్వాధీనం చేసుకున్నారు. కాని పలు ప్రాంతాల్లో ఖాళీ సీసాల్లో కల్తీ మద్యం నింపి అమ్మకాలు జరుపుతున్నారు. వీటికి తోడు కర్ణాటక ప్రాంతం నుంచి వచ్చె ఎన్‌డీపీఎల్‌ మద్యాన్ని రాకుండా చర్యలు తీసుకోవాలని, ఎయిర్‌పోర్ట్‌ ప్రాంతాల్లో గట్టి నిఘా పెట్టాలని డిప్యూటి కమిషనర్‌ అదేశించారు.

జి ల్లాలో 210 కిలోల గంజాయి, నాలుగు కిలోల గంజాయి చాక్లెట్లు, 3 కిలోల హషీష్‌ అయిల్‌, 6.4 గ్రాముల ఎండీఎంఎ డ్రగ్స్‌ను పట్టుకున్నారు. దూల్‌పేట్‌ ప్రాంతంలో గట్టి చర్యలు చేపట్టడంతో గంజాయి వ్యాపారాలు హైదరాబాద్‌ పరిసర ప్రాంతాల నుంచి గంజాయి అమ్మకాలు సాగిస్తున్నారనే సమాచారం ఉందని, ఈ గంజాయి అమ్మకాలపై మరింతగా నిఘా పెంచి గంజాయిని, డ్రగ్స్‌ను పట్టుకోవాలన్నారు.

ఇతర పెండిoగ్‌ కేసుల్లో చార్జీషీట్స్‌వేయడం, లిక్కర్‌ అమ్మకాల్లో ధరల వ్యత్యాసాలు లేకుండా చేసుకోవాలని సూచించారు.

ఈ సమావేశంలో అసిస్టేంట్‌ కమిషనర్‌ ఆర్‌ కిషన్‌, శంషాబాద్‌, మేడ్చల్‌, మల్కాజ్‌గిరి , సరూర్‌నగర్‌, వికారాబాద్‌ ఎక్సైజ్‌ సూపరిండెంట్లు కృష్ణప్రియ, ఎస్‌కె పయాజోద్దీన్‌, కె. నవీన్‌కుమార్‌, ఎస్‌, ఉజ్వలరెడ్డి, కె. విజయ భాస్కర్‌తో పాటు ఏఈఎస్‌లు, డిటిఎఫ్ టీమ్‌, 20 ఎక్సైజ్‌ స్టేషన్ల సీఐలు పాల్గోన్నారు.