.భారత్ న్యూస్ హైదరాబాద్…ఇష్టమొచ్చినట్లు చార్జీలు పెంచి.. ప్రయాణికులను దోచుకుంటున్న ఆర్టీసి
12 కిలోమీటర్ల దూరానికి గతంలో రూ.20 ఛార్జ్ ఉంటే ఇప్పుడు రూ.30 చేసిన ఆర్టీసి..
ఎందుకు పెంచారు అని అడిగితే టోల్ పెట్టారు అందుకు పెంచారు అని సమాధానం ఇస్తున్న కండక్టర్.
బస్సు టికెట్లో టోల్ మెన్షన్ చేయకుండా టికెట్ ఇచ్చి ఎందుకు టికెట్ రేటు పెరిగిందంటే.. నోటి మాటగా టోల్ చార్జీ అని చెబుతున్న ఆర్టీసి సిబ్బంది.
టికెట్ అడిగింది కోదాడకు 12 km దూరంలో ఉన్న చెరువుమదారం క్రాస్ రోడ్ స్టేజీ వరకు, కానీ బస్సు కండక్టర్ టికెట్ ఇచ్చింది కోదాడకు 18 km దూరంలో ఉన్న నేలకొండపల్లి వరకు.
బస్ స్టాప్ ఉన్నప్పటికీ అడిగిన స్టేజికి కన్నా రెండు స్టేజీలు ఎక్కువ టికెట్ కొట్టి దానికి టోల్ పేరు చెప్పి ప్రయాణికులను దోచుకుంటున్నారు అని ఆవేదన వ్యక్తం చేసిన ప్రయాణికుడు…