భారత్ న్యూస్.మేడ్చల్ మల్కాజిగిరి. తెలంగాణ ప్రభుత్వం
సమాచార పౌర సంబంధాల శాఖ రెన్
తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమీషన్ నిర్వహిస్తున్న గ్రూప్ -1 సర్వీసెస్ మెయిన్స్ రాత పరీక్షకు అభ్యర్థులను మధ్యాహ్నం 12.30 గంటల నుండి 1.30 గంటల వరకు మాత్రమే పరీక్షా కేంద్రాలలోనికి అనుమతిస్తారని మేడ్చెల్ మల్కాజిగిరి జిల్లా కలెక్టర్ గౌతం ఒక ప్రకటనలో తెలిపారు.
ఈ నెల 21 నుండి 27 వరకు తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమీషన్ నిర్వహిస్తున్న గ్రూప్ -1 సర్వీసెస్ మెయిన్స్ రాత పరీక్షకు గాను సంబంధిత అధికారులు సమన్వయంతో పరీక్షలు సజావుగా ప్రశాంతంగా జరిగేలా చూడాలని జిల్లా కలెక్టర్ గౌతం తెలిపారు.
తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమీషన్ నిర్వహిస్తున్న గ్రూప్ -1 సర్వీసెస్ మెయిన్స్ రాత పరీక్షకు మేడ్చెల్ మల్కాజిగిరి జిల్లాలో 27 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేయడం జరిగిందని, ఈ పరీక్ష మధ్యాహ్నం 2.00 గంటల నుండి సాయంత్రం 5.00 గంటల వరకు నిర్వహిస్తారన్నారు. మధ్యాహ్నం 12.30 గంటల నుండి 1.30 వరకు మాత్రమే పరీక్షా కేంద్రాలలోనికి అభ్యర్థులను అనుమతిస్తారని స్పష్టం చేసారు.