భారత్ న్యూస్. హైదరాబాద్ :
పత్తి పంట కొనుగోలుకు సిసిఐ కేంద్రాలు తెరవాలి.

  • తెలంగాణ రైతు సంఘం డిమాండ్

రాష్ట్రంలో పత్తి పంట కొనుగోలుకు కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (సిసిఐ) కొనుగోలు కేంద్రాలు తెరవాలని తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర కమిటీ డిమాండ్ చేస్తున్నది.

వానాకాలంలో రైతులు పండించిన పత్తి పంట చేతికొచ్చింది. పత్తి పంట అమ్మకానికి ఇంకా సీసీఐ కొనుగోలు కేంద్రాలు తెరవలేదు. దాంతో రైతులు ప్రవేట్ వ్యాపారులకు తక్కువ రేటుకు అమ్ముకుంటున్నారు. ఈ సీజన్లో వర్షాలు సకాలంలో పడక వేసిన విత్తనాలు మొలకెత్తలేదు. అధిక వర్షాల వలన విత్తనాలు మునిగిపోయాయి. దాంతో రైతులు రెండు మూడు సార్లు పత్తి విత్తనాలు నాటారు. చీడపీడల వల్ల పెట్టుబడి పెరిగి దిగుబడి తగ్గింది. క్వింటాలు పత్తికి రూ.7,521 మద్ధతు ధరను కేంద్రం ప్రభుత్వం నిర్ణయించింది. స్వామినాథన్ కమిటీ సిఫార్సుల ప్రకారం క్వింటాల్ పత్తికి రూ.12,000 ధరలు నిర్ణయించాలి. రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికలలో ఇచ్చిన హామీ ప్రకారం క్వింటాలుకు రూపాయలు 475 బోనస్ కలిపి ఇవ్వాలి. 8 నుండి 12 శాతం వరకు తేమవున్నా కొనుగోలు చేయాలి. సిసిఐ కొనుగోలు కేంద్రాల్లో తేమ పేరుతో రైతులు తెచ్చిన పత్తిని కొనుగోలు చేయకుండా ఇబ్బందులు పెట్టరాదు.