..భారత్ న్యూస్ హైదరాబాద్….భారతీయ రైల్వే 4.0లో భాగంగా నెలరోజుల్లో 2లక్షల 50వేల ఫిర్యాదులను పరిష్కరించిందని రైల్వే మంత్రిత్వశాఖ ప్రకటించింది.
పార్లమెంట్ సభ్యుల నుంచి వచ్చిన వెయ్యి 65 సమస్యలకు మార్గం చూపింది.
వీటితో పాటు ఆయా రాష్ట్ర ప్రభుత్వాలనుంచి వచ్చిన 138 కేసులను పరిష్కరించినట్లు భారతీయ రైల్వే మంత్రిత్వశాఖ వెల్లడించింది.
50వేల పరిశుభ్రత కార్యక్రమాల లక్ష్యానికి మిన్నగా 56వేల 168 పరిశుభ్రత డ్రైవ్ లను చేపట్టినట్లు తెలిపింది.
చెత్తసామగ్రి రూపంలో 452 కోట్ల 40లక్షల రూపాయల ఆదాయాన్ని ఆర్జించినట్లు రైల్వే మంత్రిత్వశాఖ వివరించింది.