భారత్ న్యూస్.మేడ్చల్ మల్కాజిగిరి:
విజయదశమి అంటేనే విజయం.
జిల్లా ప్రజలకు దసరా పండుగ శుభాకాంక్షలు,
మేడ్చల్ – మల్కాజిగిరి జిల్లా కలెక్టర్, గౌతమ్.
జిల్లా కలెక్టర్ గౌతమ్ మాట్లాడుతూ దసరా (విజయ దశమి) పండగ సందర్భంగా విజయానికి ప్రతీకగా నిలుస్తుంది అని తెలిపినారు. దేవీ శరన్నవరాత్రులను పురస్కరించుకొని తొమ్మిది రోజుల పాటు దుర్గామాతను వివిధ అలంకరణలతో అలంకరించి , అమ్మవారికి ప్రత్యేక పూజలు చేస్తారని, అనంతరం విజయదశమి (దసరా) పండగను జరుపుకోవడం ఎంతో శుభపరిణామమని అన్నారు.
ఈ దసరా పండగను ప్రతి ఒక్కరూ ఆనందోత్సాహాల మధ్య జరుపుకోవాలని ఆకాంక్షిస్తూ
కలెక్టర్ గౌతమ్ జిల్లా ప్రజలకు దసరా పండుగ శుభాకాంక్షలు తెలిపారు.