…భారత్ న్యూస్ హైదరాబాద్…చాకలి ఐలమ్మ విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని
మున్సిపల్ చైర్మన్ గారికీ వినతి పత్రాన్ని అందజేసిన పట్టణ రజక సంఘం నాయకులు
ఈరోజు గద్వాల జిల్లా కేంద్రంలోని మున్సిపల్ చైర్మన్ శ్రీ బి.యస్.కేశవ్ స్వగృహాం నందు ఆదివారం పట్టణ రజక సంఘం నాయకులు పూలబొక్కే ఇచ్చి మర్యాద పూర్వకంగా కలిశారు ఈ సందర్బంగా గద్వాల పట్టణంలోని చాకలి ఐలమ్మ విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని కోరుతూ వారికీ వినతి పత్రం ఇవ్వడం జరిగింది. దీనికి సానుకూలంగా స్పందించి చైర్మన్ కేశవ్ చాకలి ఐలమ్మ విగ్రహ ఏర్పాటుకు నా వంతు కృషి చేస్తానని రజక సంఘం నాయకులు తెలిపారు.
ఈ కార్యక్రమంలో :- గద్వాల పట్టణ రజక సంఘం నాయకులు తదితరులు పాల్గొన్నారు..