భారత్ న్యూస్. సికిందాబాద్ :
పరిశుభ్రతపై ” స్వచ్ఛతా పఖ్వాడా ” ముమ్మర అవగాహన ప్రచార కార్యక్రమం ముగింపు

సికింద్రాబాద్ డివిజన్ 1 అక్టోబర్ 2024 నుండి 15 అక్టోబర్ 2024 వరకు రైల్వే ప్రాంగణాలలో మరియు రైళ్లలో ‘స్వచ్ఛత పఖ్వాడా-2024’ పరిశుభ్రతపై పెద్ద ఎత్తున సామూహిక అవగాహన ప్రచారాన్ని నిర్వహించింది. ఈ కార్యక్రమంలో భాగంగా సికింద్రాబాద్ డివిజన్ ఈ పక్షం రోజులు రోజు వారీ కార్యక్రమాలను నిర్వహించింది. ఈ రోజు వారీ కార్యక్రమాలలో భాగంగా 01 అక్టోబర్ 2024న సామూహిక స్వచ్ఛతా ప్రతిజ్ఞ మరియు స్వచ్ఛతా పట్ల అవగాహన, 2 అక్టోబర్ 2024 న మహాత్మా గాంధీ జయంతి & స్వచ్ఛ భారత్ దివస్ వేడుకలు , 03 అక్టోబర్ 2024న ప్రధాన స్టేషన్‌లలో స్వచ్ఛ స్టేషన్‌లు (క్లీన్ స్టేషన్‌లు), 04 అక్టోబర్ 2024 & 05 అక్టోబర్ 2024 స్వచ్ఛ రైల్‌గాడి (క్లీన్ రైళ్లు), 07 అక్టోబర్ 2024 న స్వచ్ఛ పత్రి (క్లీన్ ట్రాక్‌లు), 08 అక్టోబర్ 2024న స్వచ్ఛ్ పారిసార్ (క్లీన్ వర్క్ ప్లేస్ & క్లీన్ రెసిడెన్షియల్ ప్రెమిసెస్), 09 అక్టోబర్ 2024 & 10 అక్టోబర్ 2024న స్వచ్ఛ్ ఆహార్ (క్లీన్ ఫుడ్), 11 అక్టోబర్ 2024 న స్వచ్ఛ నీర్ (క్లీన్ వాటర్) 12 అక్టోబర్ 2024న స్వచ్ఛ్ ప్రసాదన్ & స్వచ్ఛ పర్యావరణం , 13 అక్టోబర్ 2024న స్వచ్ఛ్ పోటీ , 14 అక్టోబర్ 2024 న సింగిల్ యూజ్ ప్లాస్టిక్‌ను నివారించడం మరియు 2024 అక్టోబర్ 2024న రైల్వే ప్రాంగణంలో సమీక్ష / బ్రీఫింగ్ మరియు స్వచ్ఛ్ అవగాహన ర్యాలీతో కార్యక్రమం ముగిసింది. ఈ కార్యక్రమం సామాజిక సేవా సంస్థలు, రైల్వే ప్రయాణికులు మరియు రైల్వే అధికారులు మొదలైన వారి సమన్వయం మరియు భాగస్వామ్యంతో విజయవంతంగా పూర్తి చేయడం జరిగినది.
ఇంతకుముందు, డివిజన్ 17 సెప్టెంబర్, 2024 నుండి 02 అక్టోబర్, 2024 వరకు స్వచ్ఛతా హి సేవా 2024 కార్యక్రమాన్ని నిర్వహించింది. ఈ కార్యక్రమంలో డివిజనల్ అధికారులు మరియు సిబ్బంది అందరూ కలిసి 687 క్లీన్లీనెస్ టార్గెట్ యూనిట్లు మరియు శ్రమదాన్, స్వచ్ఛతా ప్రతిజ్ఞ, ఏక్ పెడ్ మా కే నామ్ , హ్యూమన్ చైన్స్, స్వచ్ఛ్ ఫుడ్ స్ట్రీట్స్, స్వాహాత చౌపాల్ , డోర్ టు డోర్ అవేర్‌నెస్, వాకథాన్, పబ్లిక్ వర్క్‌షాప్‌లు, యూత్ కనెక్ట్, వేస్ట్ టు ఆర్ట్, సెల్ఫీ పాయింట్స్ & నుక్కడ్ సఫాయ్ వీధి నాటకాలు మొదలయిన 496 కార్యక్రమాలను స్వచ్ఛతలో జన్ భగీదారి లో పూర్తి చేశారు . వీటితోపాటు 23 కార్యక్రమాలలో సఫాయి మిత్ర సురక్ష శిబిరాలను కూడా నిర్వహించారు . ఈ సంధర్భంగా 02 అక్టోబర్ 2024న జరిగిన కార్యక్రమంలో సఫాయి మిత్రలను సత్కరించారు.
‘స్వచ్ఛత పఖ్వాడా సమయం’లో రైల్వే ప్రాంగణాల్లో శుభ్రతలో కనిపించే స్పష్టమైన మరియు నిశ్చితమైన మెరుగుదలని నిర్ధారించడానికి ప్రయత్నాలు జరిగాయి. రైల్వే ప్రాంగణంలోని ‘యాంటీ లిటరింగ్ పెనాల్టీస్’ మరియు రైల్వే ప్రాంగణాన్ని పరిశుభ్రంగా ఉంచడానికి రైల్వే వారి అవిశ్రాంత ప్రయత్నాలపై రైలు వినియోగదారులలో అవగాహనను మెరుగుపరచడానికి కూడా ప్రయత్నాలు జరిగాయి. డివిజనల్ రైల్వే మేనేజర్ శ్రీ భరతేష్ కుమార్ జైన్ ఈ కార్యక్రమం విజయవంతం కావడానికి పాల్గొన్న వారందరినీ అభినందించారు. ఆరోగ్యకరమైన మరియు మెరుగైన భారతదేశం కోసం సంవత్సరం పొడవునా పరిశుభ్రమైన మరియు పచ్చటి వాతావరణాన్ని నిర్వహించడంలో అదే ఉత్సాహంతో కొనసాగాలని సూచించారు.