భారత్ న్యూస్ హైదరాబాద్….దీపావళికి పేకాట స్థావరాలు.. పేకాటరాయుళ్లకు అండగా అధికార పార్టీ నేతలు

దీపావళికి పేకాటరాయుళ్లు పేకాట ఆడేందుకు అధికార పార్టీ నేతలే రహస్యంగా పేకాట స్థావరాలను ఏర్పాటు చేసినట్లు సమాచారం.

దీనికి భారీగా కేటీ తీసి 50% నిర్వాహకులకు, 50% పేకాటరాయుళ్ల విందులకు ఇచ్చేందుకు ఇప్పటికే ఒప్పందాలను చేసుకున్నట్లు తెలిసింది.

జుక్కల్ నియోజకవర్గంలోని బిచ్కుంద, జుక్కల్, పిట్లం, నిజాంసాగర్, మహమ్మద్ నగర్, ఎల్లారెడ్డి నియోజకవర్గంలోని లింగంపల్లి, గాంధారి, నాగిరెడ్డిపేట, ఎల్లారెడ్డి మండలం, బాన్సువాడ నియోజకవర్గంలోని బీర్కూర్, బాన్సువాడ పట్టణాల్లో రహస్యంగా వ్యవసాయ భూముల్లో పేకాట స్థావరాలు వేసుకున్నట్టు సమాచారం.

అధికార పార్టీ నేతలు పేకాట స్థావరాలపై దాడులు నిర్వహించకుండా చూసీచూడనట్లు ఉండాలని పోలీసులను కోరినట్లు సమాచారం..