..భారత్ న్యూస్ హైదరాబాద్….పవర్ లిఫ్టింగ్ క్రీడలో ప్రపంచ ఛాంపియన్ గా ఎదిగిన మన ఆదివాసీ బిడ్డ, భద్రాచలం ఏజెన్సీ మారుమూల ఇప్పగూడెంలో పుట్టి ఇప్పుడు ఇండియాకు ప్రాతినిధ్యం వహిస్తోన్న పవర్ లిఫ్టర్ మోడెం వంశీ గారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని జూబ్లీహిల్స్ నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు.

మాల్టాలో జరిగిన అంతర్జాతీయ పవర్ లిఫ్టింగ్ పోటీల్లో భారత్ తరపున సాధించిన బంగారు పతకం, ఇటీవల సౌతాఫ్రికాలో జరిగిన కామన్వెల్త్ పవర్ లిఫ్టింగ్ ఛాంపియన్షిప్ లో తాను సాధించిన బంగారు పతకాలను వంశీ గారు చూపించగా, ముఖ్యమంత్రి గారు అభినందించారు.

ప్రతిభకు పేదరికం అడ్డురాదని నిరూపిస్తూ, రోజుకూలీ ఇంట్లో పుట్టినా పట్టుదలతో ఈరోజు ప్రపంచ విజేతగా మోడెం వంశీ గారు ఇండియా కీర్తిని మరింత పెంచారని ఈ సందర్భంగా ముఖ్యమంత్రి గారు ప్రశంసించారు.

మహబూబాబాద్ ఎంపీ బలరాం నాయక్ గారు, భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు గారు, తెలంగాణ స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ శివసేనారెడ్డి గారు, పలువురు నేతలు కూడా ఉన్నారు…