.భారత్ న్యూస్ హైదరాబాద్….…జాతీయ రహదారిపై బీసీ గురుకుల విద్యార్థుల ఆందోళన
రంగారెడ్డి – బాటసింగారం వద్ద జాతీయ రహదారిపై బీసీ గురుకుల విద్యార్థులు ఆందోళన చేపట్టారు.
తమ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ.. రోడ్డుపై బైఠాయించారు.
ఆహారం సరిగ్గా ఉండటం లేదని.. ఎన్ని సార్లు ఫిర్యాదు చేసినా ఎవరూ పట్టించుకోవడం లేదని ఆరోపిస్తున్నారు. తమ సమస్య పరిష్కరించే వరకు.. నిరసన కొనసాగిస్తామని అంటున్నారు.
విద్యార్థుల ఆందోళనతో.. రహదారిపై వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది…