.భారత్ న్యూస్ హైదరాబాద్….ఆసిఫాబాద్ జిల్లా వాంకిడి గిరిజన ఆశ్రమ ఉన్నత పాఠశాలలో అస్వస్థతకు గురైన విద్యార్థినులను నిమ్స్ ఆసుపత్రిలో పరామర్శించిన మాజీ మంత్రి హరీష్ రావు
వెంటిలేటర్ మీద చావు బ్రతుకుల్లో పిల్లలు ఉంటే ఏం చేస్తున్నట్టు గిరిజన శాఖ..
ముఖ్యమంత్రే గిరిజన మంత్రి.. ఏం నిద్రపోతున్నావా? పిల్లల ప్రాణాల కంటే ముఖ్యమైన పని ఏముంది
రాహుల్ గాంధీ ప్రోగ్రాంలో బిజీ ఉన్నావు తప్ప.. పిల్లల ప్రాణాలను పట్టించుకోవడం లేదు
ఈ సంఘటన జరిగి ఇవాళ్టికి 6 రోజులు అయ్యింది ఒక్కసారైనా రివ్యూ చేసావా? ఏమైంది పిల్లల ఆరోగ్యమని చెక్ చేసినవా?
గిరిజన పిల్లలు, పేద పిల్లలు అంటే నీకు అంత చులకననా.. కనీసం ఒక పైసా సాయం చేయలేదు
తక్షణమే ప్రభుత్వం స్పందించాలి.. పిల్లలకు మంచి కార్పొరేట్ వైద్యాన్ని అందించాలి – హరీష్ రావు…