భారత్ న్యూస్.మేడ్చల్.మల్కాజిగిరి:
పూలనే దేవతగా భావించి పూజించే పండుగ బతుకమ్మ పండుగ, అలాంటి బతుకమ్మ పండుగను గత ఏడురోజులుగా ఎంతో ఉత్సహాంగా జరుపుకుంటున్నామని మేడ్చెల్ మల్కాజిగిరి జిల్లా జిల్లారెవెన్యూ అధికారి హరిప్రియ అన్నారు.
మేడ్చెల్ మల్కాజిగిరి జిల్లా కలెక్టరేట్ ప్రాంగణంలో ఎస్సీ సంక్షేమ, షెడ్యూలు తెగలు, విద్యా, పౌర సరఫరాల శాఖల ఆధ్వర్యంలో బుధవారం ఘనంగా బతుకమ్మలను తయారు చేసి కలెక్టరేట్లోని మహిళ అధికారులు, సిబ్బందితో కలిసి డిఆర్ఓ ఆనందోత్సహాలతో బతుకమ్మ ఆటలు ఆడారు. మహిళలందరు బతుకమ్మ పాటలు పాడుతూ ఎంతో సంతోషంగా బతుకమ్మ ఆడారు.