భారత్ న్యూస్.మేడ్చల్ మల్కాజిగిరి: ప్రభుత్వ పాలనలో పారదర్శకత, జవాబుదారీ తనం కోసం తీసుకొచ్చిన సమాచార హక్కు చట్టం ను సద్వినియోగం చేసుకోవాలని సమాచార హక్కు పరిరక్షణ సమితి, ఎలక్షన్ వాచ్ కమిటీ జాతీయ ఛైర్మెన్ డా.బొమ్మర బోయిన కేశవులు ముదిరాజ్ తెలిపారు.
సమాచార హక్కు చట్టం 2005 ఆవిర్భావ దినోత్సవం ను పురస్కరించుకుని సమాచార హక్కు పరిరక్షణ సమితి, ఎలక్షన్ వాచ్ కమిటీ ఆధ్వర్యంలో గురువారం హైదరాబాద్ లోని సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో సమాచార హక్కు చట్టం పై నిర్వహించిన అవగాహన సదస్సుకు ఆయన అధ్యక్షత వహించి మాట్లాదారు. దేశంలో ఎన్నో చట్టాలు తెచ్చినా యూపీఏ ప్రభుత్వం సమాచార హక్కు చట్టం-2005 పేరుతో తెచ్చిన చట్టం ఎంతో కీలకమైందని వివరించారు. ప్రజాస్వామ్య పాలనలో సమాచారం తెలుసుకోవడం పౌరుల హక్కు అని తెలిపారు. చట్టంను అవసరమైన వారు వినియోగించుకోవాలని సూచించారు. సమాచార హక్కు చట్టంను దుర్వినియోగం కాకుండా చూసుకోవాలని సూచించారు. అవినీతిని వెల్కితీయాలనుకునేవారు చట్టాన్ని సంధించాలని సూచించారు. దేశంలో విచ్చల విడిగా అవినీతి, అక్రమాలు చోటు చేసుకుంటున్నాయని, వాటిని నిరోధించడానికి సమాచార హక్కు పరిరక్షణ సమితి, ఎలక్షన్ వాచ్ కమిటీ కార్యకర్తలు కృషిచేయాలన్నారు. తమ సంస్థ సమాచార హక్కు పరిరక్షణ సమితి, ఎలక్షన్ వాచ్ కమిటీ గ్రామ, మండల, నియోజకవర్గం, జిల్లా, రాష్ట్ర, జాతీయ స్థాయిలో సమాచార హక్కు చట్టం పై అవగాహన కల్పిస్తూ ప్రజలను చైతన్యం చేస్తున్నామని వివరించారు. 2009 లో ప్రారంభించిన సమాచార హక్కు పరిరక్షణ సమితి సదస్సులు, ర్యాలీలు, సమావేశాలు, చర్చవేధికలు నిర్వహిస్తూ చట్టం ను సద్వినియోగం చేసుకునేలా కృషిచేస్తున్నామని తెలిపారు. సమాచార హక్కు పరిరక్షణ సమితి తో పాటు ఎలక్షన్ వాచ్ కమిటీ ద్వారా ఎన్నికలు పారదర్శకంగా జరిగేలా, అక్రమాలు అరికట్టి, ఓటింగ్ శాతం పెంచేందుకు కృషి చేస్తున్నట్లు తెలిపారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ, పార్లమెంట్, ఎమ్మెల్సీ ఎన్నికలలో సమాచార హక్కు పరిరక్షణ సమితి, ఎలక్షన్ వాచ్ కమిటీ కార్యకర్తలు ఓటర్ చైతన్య ర్యాలీలు, సదస్సులు, సమావేశాలు నిర్వహించి ఓటు హక్కు వినియోగం విసృతంగా ప్రచారం చేసి ఓటింగ్ శాతం పెంచేందుకు కృషి చేశానని తెలిపారు. తాము చేసిన ప్రయత్నం రాష్ట్ర చీఫ్ ఎలెక్టోరల్ అధికారి వికాస్ రాజ్ ప్రత్యేకంగా అభినందించారు గుర్తు చేశారు. సమాచార హక్కు చట్టం ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా యువతి యువకులు, మహిళలు అవినీతి లేని మెరుగైన సమాజం కోసం పాటుపడేలా కంకణం కట్టుకోవాలని పిలుపు నిచ్చారు. సమాచార హక్కు పరిరక్షణ సమితి ఎలక్షన్ వాచ్ కమిటీ కార్యకర్తలు మరింత ఉత్సాహంతో పనిచేసి అవినీతికి ఆస్కారం లేకుండా పెద్ద, బడుగు, బలహీనవర్గాల అభ్యాన్నతికి, రాష్ట్ర, దేశాభివృద్ధికి పాటుపడాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథి గా హాజరైన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ గ్రంథి భవానీప్రసాద్ మాట్లాడుతూ మనకు అవసరమున్న అన్ని చెట్టలు ఉన్నాయని వివరించారు. జీవించే హక్కు, మాట్లాడే హక్కు, ప్రశ్నించే హక్కు ఉన్నాయని తెలిపారు. చట్టాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. సమాచార హక్కు చట్టం పై కేశవులు ముదిరాజ్ చేస్తున్న కార్యక్రమాలను అభినందించారు. మరో అతిథి రిటైర్డ్ ఐఆర్ఎస్ అధికారి మంగబాబు మాట్లాడుతూ సమాచార హక్కు పరిరక్షణ సమితి, ఎలక్షన్ వాచ్ కమిటీ పేరుతో సంస్థను స్థాపించి క్షేత్ర స్థాయిలో చట్టంపై అవగాహన కల్పిస్తున్న డా.కేశవులు ముదిరాజ్ చేస్తున్న కార్యక్రమాలు గొప్పవని తెలిపారు. ఆయనను అభినందిస్తూ ప్రభుత్వం చేపట్టే సమాచార హక్కు చట్టం కమిషనర్ ల నియామకంలో అవకాశం ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. అంతకు ముందు ఉదయం మంత్రి కోమటిరెడ్డి తన నివాసంలో కరపత్రం విడుదల చేశారు. అవగాహన సదస్సుకు సందేశం పంపుతూ సమాచార హక్కు పరిరక్షణ సమితి, ఎలక్షన్ వాచ్ కమిటీ చేస్తున్న కార్యక్రమాలను అభినందించారు. ప్రో. హర గోపాల్ తన సందేశం పంపించారు. సమాచార హక్కు చట్టం గురించి డా.కేశవులు ముదిరాజ్ చేస్తున్న కార్యక్రమాలు గుర్తించదగిన వని చెప్పారు. అవసరం ఉన్నవారు సమాచార హక్కు చట్టం ను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
ప్రముఖ న్యాయవాది డీఎల్ పండు మాట్లాడుతూ చట్టాలను క్షేత్ర స్థాయిలో అవగన కల్గించేందుకు కేశవులు ముదిరాజ్ చేస్తున్న కృషిని అభినందించారు. ఈ సందర్భంగా అవగాహన సదస్సులో సమాచార హక్కు పరిరక్షణ సమితి రూపొందించిన కరపత్రాన్ని, సమాచార హక్కు చట్టం పుస్తకాలను జస్టిస్ గ్రంథి భవానీప్రసాద్, రిటైర్డ్ ఐఆర్ఎస్ మంగబాబు లు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా తెలంగాణ సాంస్కృతిక విభాగం కళాకారులు ఏటా, పాటలతో మర్మోగించారు. ఈ సందర్భంగా దిగ్గజ పారిశ్రామిక వేత్త