భారత్ న్యూస్ :రాజేంద్రనగర్: హైదరాబాదు నగరంలో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొనేందుకు వచ్చిన కర్ణాటక వ్యవసాయ శాఖ మంత్రి ఎన్. చలువరాయ స్వామి శుక్రవారం ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం ను సందర్శించారు. పరిపాలన భవనం వద్ద ఆయనకు రిజిస్ట్రార్ డాక్టర్ పి రఘురామిరెడ్డి స్వాగతం పలికారు. అనంతరం వ్యవసాయ విశ్వవిద్యాలయం ఉన్నతాధికారులతో చలువరాయ స్వామి ముఖాముఖి సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం చేపడుతున్న బోధన, పరిశోధన, విస్తరణ కార్యక్రమాల గురించి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా విశ్వవిద్యాలయం రిజిస్ట్రార్, కర్ణాటక వ్యవసాయ శాఖ మంత్రికి వివరించారు. వివిధ విభాగాలలో వ్యవసాయ విశ్వవిద్యాలయం సాధించిన విజయాలను, అందిన పురస్కారాలను గురించి వ్యవసాయ శాఖ మంత్రి కి వివరించారు. వ్యవసాయ విశ్వవిద్యాలయం చేపడుతున్న కార్యక్రమాలను తెలుసుకోవటం పట్ల కర్ణాటక వ్యవసాయ శాఖ మంత్రి చలువరాయ స్వామి ఆసక్తినీ వ్యక్తపరిచారు. అనంతరం రాజేంద్రనగర్ లోని వ్యవసాయ పరిశోధన కేంద్రంలో ఏర్పాటుచేసిన డ్రోన్ అకాడమీ నీ వ్యవసాయ శాఖ మంత్రి సందర్శించారు. డ్రోన్ అకాడమీ ద్వారా చేపడుతున్న శిక్షణా కార్యక్రమాలు, అందిస్తున్న సేవలు గురించి ఆయన శాస్త్రవేత్తలను అడిగి తెలుసుకున్నారు. అలాగే పరిపాలనా భవనంలోని అగ్రికల్చర్ ఇన్ఫర్మేషన్ సెంటర్ ను కూడా వ్యవసాయ శాఖ మంత్రి సందర్శించారు. ఈ కార్యక్రమంలో కర్ణాటక వ్యవసాయ శాఖ మంత్రి ఓ ఎస్ డి ప్రొఫెసర్ పాటిల్ తో పాటు వ్యవసాయ విశ్వవిద్యాలయం ఉన్నతాధికారులు కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు.