…భారత్ న్యూస్ హైదరాబాద్….ఢిల్లీలో ఘోర అగ్ని ప్రమాదం …

ఢిల్లీలో ఘోర అగ్ని ప్రమాదం సంభవించింది. అలీపూర్‌ ప్రాంతంలో చాణక్య ధర్మ కాంట సమీపంలోని రేకుల ఫ్యాక్టరీలో అకస్మాత్తుగా శనివారం సాయంత్రం భారీగా మంటలు చెలరేగాయి. ఘటనా స్థలానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది మంటలను ఆర్పేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ ప్రమాదానికి సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.