..భారత్ న్యూస్ హైదరాబాద్…బీసీ గురుకులంలో 12 మంది విద్యార్థులకు అస్వస్థత..

సంగారెడ్డి – నారాయణ ఖేడ్‌లోని మహాత్మా జ్యోతిబాపూలే బీసీ బాలుర గురుకులానికి చెందిన 12 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు.

జ్వరం, కడుపునొప్పి, వాంతులు, విరేచనాలతో ఇబ్బంది పడ్డారు. దీంతో విద్యార్థులను తల్లిదండ్రులు ఇంటికి తీసుకెళ్లారు. స్వల్పంగా అస్వస్థతకు గురైన వారికి సిబ్బంది మందులను అందజేశారు.

గురుకులంలో ఉన్న నీటిశుద్ధి ప్లాంటు పాడైపోవడంతో కొన్ని నెలలుగా మిషన్ భగీరథ నీటిని సరఫరా చేస్తున్నారు. పైప్ లైన్ లీకేజీతో నీరు కలుషితమౌతోందని విద్యార్థులతో పాటు తల్లిదండ్రులు వాపోతున్నారు..