స్మార్ట్ ఫోన్ కష్టాలు …

ప్రస్తుతం ఉన్న జీవన విధానంలో అనేక మందికి స్మార్ట్‌ ఫోన్‌ ఓ భాగమైపోయింది. అందుకేనేమో ఫోన్‌ లేకపోతే ఏదో కోల్పోయిన ఫీలింగ్ కలుగుతుందంటారు చాలా మంది. ఇక వ్యక్తులు, వ్యవస్థల మధ్య కూడా మెరుగైన కమ్యూనికేషన్‌లో స్మార్ట్ ఫోన్ కీ రోల్ పోషిస్తుందంటున్నారు నిపుణులు. అయితే ప్రస్తుతం దీనిని పెద్దలే వాడుతున్నారు అనుకుంటే పొరపాటే.. ఇంట్లో పిల్లలు కూడా ఫోన్లకు అడిక్ట్ అవుతున్నారు. దీనివల్ల పలు హెల్త్‌ ఇష్యూస్ తలెత్తే చాన్స్ ఉంటుందని వైద్యులు చెప్తున్నారు.

స్మార్ట్‌ఫోన్ వాడుతున్న పిల్లల్లో ఏర్పడే సమస్యలను తెలుసుకోవడానికి గ్లోబల్ మైండ్ ప్రాజెక్టులో భాగంగా Sapien Labs‌కు చెందిన పరిశోధకులు 27,969 మంది యువకులకు సంబంధించిన హెల్త్ డేటాను సేకరించి ఎనలైజ్ చేశారు. ఈ సందర్భంగా వారు చిన్న వయసులో తరచుగా ఫోన్ చూసేవారు తమ యుక్త వయసుకు వచ్చే సరికి పలు మానసిక రుగ్మతలను ఎదుర్కొంటున్నట్లు గుర్తించారు. ముఖ్యంగా డిప్రెషన్, యాంగ్జైటీ, సోషల్ యాంగ్జైటీస్ వంటి సమస్యలు ఎదుర్కొంటారని పేర్కొన్నారు. అంతేకాకుండా చిన్నప్పుడు ఎక్కువగా ఫోన్లకు బానిసలైన వారు యుక్త వయసులో తక్కువస్థాయి జ్ఞాపక శక్తిని, తక్కువ స్థాయి ఆత్మాభిమానాన్ని(self-esteem) కలిగి ఉండే చాన్స్ ఉందని పరిశోధకులు వెల్లడించారు.