
మండే ఎండల్లో బెస్ట్ ఎనర్జీ డ్రింక్.. తాగారంటే దెబ్బకు షేక్ అవ్వాల్సిందే. వేసవిలో చాలా మంది మ్యాంగో షేక్ తాగడానికి అందరూ ఇష్టపడతారు. ఇది శరీరానికి తాజాదనాన్ని అందించడంలో సహాయపడుతుంది. కానీ ప్రతిదానికీ ప్రయోజనాలు.. అప్రయోజనాలు రెండూ ఉంటాయన్న విషయాన్ని గుర్తుంచుకోవాలి.. కాబట్టి వేసవిలో మ్యాంగో షేక్ తాగడం వల్ల కలిగే ప్రయోజనాలు.. నష్టాలు, అలాగే ఏ వ్యక్తులు దీన్ని తాగకూడదో నిపుణుల నుంచి తెలుసుకోండి..
తీపిగా.. భలే రుచిని కలిగి ఉండే మామిడి పండును చిన్నా, పెద్దా అనే తేడా లేకుండా అందరూ లాగించేస్తారు. అందుకే మామిడి పండును.. పండ్లలో రారాజు అని పిలుస్తారు. వేసవిలో లభించే ఈ మామిడి పండు ప్రత్యేకత గురించి మనం ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.. దీనిని పచ్చిగా.. పండుగా, అలాగే ఉడికించి తింటారు. దీనితోపాటు చాలా రుచికరమైన ఆహార పదార్థాలు, పానీయాలు కూడా తయారు చేస్తారు. పాలు, పండిన మామిడి పండ్లతో తయారు చేసిన మామిడి షేక్ వేసవిలో శరీరానికి ఎంతో ఉత్సాహాన్ని ఇస్తుంది.
మామిడిపండులో ఫోలేట్, పొటాషియం, ఫైబర్, యాంటీఆక్సిడెంట్లు, విటమిన్లు ఎ, సి, ఇ, కె మరియు బి6 వంటి పోషకాలు ఉన్నాయి.. ఇవి శరీరానికి అనేక విధాలుగా మేలు చేస్తాయి.. ఉదాహరణకు విటమిన్ ఎ కళ్ళకు చాలా మేలు చేస్తుంది. అటువంటి పరిస్థితిలో, వేసవిలో మామిడి షేక్ తాగడం వల్ల శరీరానికి ఎన్నో ప్రయోజనాలు చేకూరుతాయనడంలో ఎలాంటి సందేహం అక్కర్లేదు..
అయితే.. మామిడి షేక్ వల్ల కలిగే ప్రయోజనాలు.. నష్టాలు ఏమిటి? అలాగే, ఏ వ్యక్తులు దీన్ని తాగకూడదు. నిపుణులు ఏం చెబుతున్నారు..? ఈ విషయాలను తెలుసుకుందాం.