
ధరణి దారుణాలకు కాలం చెల్లిందా.ధరణి పోర్టల్ ప్రభుత్వం రద్దు చేసి కొత్త ఆర్వోఆర్ చట్టం భూ భారతి ను అమల్లోకి తీసుకొచ్చింది .పైలట్ ప్రాజెక్టుగా నాలుగు మండలాల్లో ప్రారంభించి జూన్ 2 నుండి పూర్తి స్థాయిలో అందుబాటులోకి తేనున్నారు.ఇప్పటికే భూ భారతి చట్టం ఎలా ఉండబోతుంది అనే అంశాలపై అవగాహన సదస్సులు ఏర్పాటు చేసి ప్రజలకు వివరించే ప్రయత్నం చేస్తున్నారు.అయితే ఈ అవగాహన సదస్సుల్లో ధరణి వల్ల ఎదుర్కొన్న సమస్యలు అధికారులకు వివరిస్తూ ప్రజలు కంటతడి పెట్టుకోవడం,భూ భారతి చట్టం రైతులకు చుట్టం లా ఉంటుందని అధికారులు వివరిస్తున్న నేపధ్యంలో అసలు ధరణి వల్ల ప్రజలు ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కున్నారు,భూ భారతి లో ఎలాంటి అంశాలు వుంటాయి లెట్స్ వాచ్.
గత బీఆర్ఎస్ ప్రభుత్వం తెచ్చిన ధరణి చట్టం భూ అక్రమార్కులకు అవకాశంగా మారితే రైతులపాలిట శాపంగా మారిందన్న ఆరోపణలు వచ్చాయి.ఏళ్లుగా సాగుచేసుకుంటున్న వారికి అన్యాయం జరిగిందన్న ఆరోపణలు వచ్చాయి. అలాగే కేవలం పట్టాదారులకే పాస్ బుక్ రావడం కూడా జరిగింది. దీంతోపాటు సాదా బైనమాలను పరిగణనలోకి తీసుకోకపోవడం ఒక మైనస్ పాయింట్ అయితే, ఎమ్మార్వోలు, ఆర్డీవోల దగ్గర సవరణలకు అవకాశం లేకోవడం మరో మైనసా పాయింట్ అయింది. దీంతో రైతులు కోర్టుకు వెళ్ళాల్సిన దుస్థితి ఏర్పడింది.ధరణి లోపాల కారణంగా గతంలో అమ్ముకున్న భూములకు కూడా కొంతమందికి పాస్ బుక్స్ రావడంతో అదే భూమిని నమ్ముకున్న రైతులు నాయకుల చుట్టూ అధికారుల చుట్టూ తిరిగి న్యాయం చేయాలని కోరే పరిస్థితి ఏర్పడింది.
గతంలో అమ్ముకున్న భూములకు పాస్ బుక్స్ పొందిన వారు భూ దందాలకు పాల్పడుతూ రియల్ ఎస్టేట్ వ్యాపారాలకు తెరలేపారు.భూముల ధరలు పెరగడం ధరణి లో ఉన్న లోపాలను ఆసరాగా చేసుకొని కొంతమంది సామాన్యులను ఇబ్బందులకు గురి చేశారు.మృతి చెందిన వారి పేరుతో నకిలీ ఆధార్ కార్డులు సృష్టించి కూడా అక్రమ రిజిస్ట్రేషన్లకు కొంతమంది ఎమ్మార్వోలు పాల్పడ్డారు.ధరణి వచ్చాక మా భూమి రికార్డుల్లో కనిపించడం లేదంటూ కాజీపేట లో వ్యక్తి ఐదేళ్లపాటు అధికారుల చుట్టూ తిరిగి తిరిగి ఇటీవలే గుండెపోటుతో మృతి చెందాడు.
2018 లో మడికొండ లో ఓ వ్యక్తి గతంలో తెలంగాణ ఇండస్ట్రీస్ కి మూడెకరాల భూమి గిఫ్ట్ రిజిస్ట్రేషన్ చేశాడు కానీ ధరణి వచ్చాక ఆ వ్యక్తి పేరు మీద మళ్ళీ పాస్ బుక్ రావడంతో ఆ వ్యక్తి ప్రస్తుతం అక్కడ ప్లాట్స్ చేసి విక్రయిస్తున్న కూడా అధికారులు పట్టించుకోవడం లేదు. ఎస్సారెస్పీ కెనాల్ కోసం గతంలో కొంతమంది భూములు తీసుకొని వాళ్లకు ప్రభుత్వం నష్టపరిహారం కూడా ఇచ్చింది.కానీ ధరణి వచ్చాక మళ్ళీ వాళ్ళు రికార్డుల్లోకి రావడం తో రియల్ ఎస్టేట్ వ్యాపారాలు చేసుకుంటున్నారు.ధరణి వచ్చాక భూ సమస్యలు పెరిగి పోయి నిత్యం ఏదో ఓ చోట భూమి పంచాయతీలు జరుగుతూనే ఉన్నాయి.ప్రతి సోమవారం నిర్వహించే ప్రజావాణి లో దరఖాస్తులు ఇచ్చేది కూడా ధరణి బాధితులే ఎక్కువ.
ధరణి ని రద్దు చేసి భూ భారతి చట్టం తీసుకురావడం పట్ల రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.ధరణి వచ్చాక చాలా ఇబ్బందులు పడ్డామని అధికారులకు ఫిర్యాదులు చేసి అలసిపోయామని భూ భారతి అవగాహన సదస్సులో రైతులు తమ ఆవేదనను తెలుపుతున్నారు.ధరణి లో సవరణలకు అవకాశం ఉండేది కాదని భూ భారతి లో సవరణలకు అవకాశం వుంటుందని రెవెన్యూ అధికారులు చేస్తున్నారు.గతంలో సవరణలు కోసం సివిల్ కోర్టుకు వెళ్లాల్సి వచ్చేదని ఇప్పుడు తహసీల్దార్ వద్ద కూడా అప్పీల్ చేసుకునే అవకాశం వుంటుందని ధరణి లో జరిగిన పొరపాట్లకు భూ భారతి ఆస్కారం లేదని రెవెన్యూ అధికారులు అంటున్నారు. అధికారులు చెప్తున్నట్టు భూ భారతి నిజంగానే రైతుల చుట్టం గా ఉంటుందా లేదా వేచిచూడాలి