..భారత్ న్యూస్ హైదరాబాద్….జిల్లా స్పోర్ట్స్ మీట్ – 2024 ముగింపు వేడుకల్లో పాల్గొన్న ఎంపీ డా.కడియం కావ్య.

ఘన స్వాగతం పలికిన విద్యార్థులు

విద్యార్థుల నుంచి గౌరవ వందనం స్వీకరించిన ఎంపి

విద్యార్థులు క్రీడాస్ఫూర్తిని కొనసాగించాలి.

విజేతలకు మెమెంటోలు సర్టిఫికెట్ లను అందజేసిన ఎంపీ.

క్రీడలు జాతీయ సమైక్యత భావాన్ని పెంచుతాయని వరంగల్ పార్లమెంట్ సభ్యురాలు డాక్టర్ కడియం కావ్య అన్నారు. ధర్మసాగర్ మండలం, కరుణాపురంలోని మహాత్మ జ్యోతిరావు పూలే గురుకుల పాటశాలలో నిర్వహించిన జిల్లా స్పోర్ట్స్ మీట్ – 2024 ముగింపు వేడుకలకు ఎంపీ డాక్టర్ కడియం కావ్య ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ…తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గురుకుల విద్యకు అధిక ప్రాధాన్యమిస్తోందని అన్నారు. రాష్ట్రంలో అత్యున్నత ప్రమాణాలతో యంగ్‌ ఇండియా ఇంటిగ్రేటెడ్‌ రెసిడెన్షియల్‌ స్కూల్స్‌ నిర్మాణానాలను చేపడుతుందని పేర్కొన్నారు. మన స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి గారి ప్రత్యేకత చొరవత స్టేషన్ ఘనపూర్ లో ఇంటిగ్రేటెడ్‌ రెసిడెన్షియల్‌ స్కూల్ ను త్వరలో నిర్మించుకోబోతున్నామని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం గురుకులాల పట్ల ప్రత్యేక శ్రద్ధతో అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నదని, క్రీడాకారులు వాటిని సద్వినియోగం చేసుకోవాలన్నారు. క్రీడలు మానసిక ఉల్లాసాన్ని కలిగిస్తా యని, ప్రతి ఒక్కరూ క్రీడా స్ఫూర్తి ని పెంపొందించుకోవాలని ఎంపీ డా. కడియం కావ్య విద్యార్థులకు సూచించారు. క్రీడలతో శారీరదారుఢ్యం, జ్ఞానం పెరుగుతుందని, క్రీడాకారులు క్రీడా నైపుణ్యాన్ని పెంపొందించుని క్రీడల్లో మెళకువలను నేర్చుకుని ముందుకువెళ్లాలన్నారు. ఆటల్లో గెలుపు ఓటములు సహజమని, ఓటమి గెలుపునకు నాంది అవుతుందని సూచించారు. సమాజం మీకు ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని జీవితంలో ఉన్నత స్థాయికి ఎదిగిన ప్రతి ఒక్కరు సమాజానికి తిరిగి చెల్లించాల్సిన బాధ్యత ఉంటుందని అన్నారు. సమాజ నిర్మాణంలో భాగమైన విద్యార్థులు ఇప్పటి నుండే మహిళల పట్ల గౌరవాన్ని కలిగి ఉండాలని అన్నారు. అనంతరం క్రీడల్లో విజేతలుగా నిలిచిన విద్యార్థులకు మెమెంటోలు, సర్టిఫికెట్ లను విధ్యర్డులకు అందజేసి వారిని అభినందించారు.

ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపల్ రవికుమార్, మరియు ఆర్ సి ఓ రాజ్ కుమార్, మరియ మనోహర్ రెడ్డి, ఇతర కళాశాల ప్రిన్సిపల్స్, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.