…భారత్ న్యూస్ హైదరాబాద్…తెలంగాణ యువతేజం, భారత చెస్ గ్రాండ్ మాస్టర్ అర్జున్ ఎరిగైసి గారు ప్రపంచ నంబర్ 2 ర్యాంకును కైవసం చేసుకున్న సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అభినందనలు తెలిపారు. తనకు అతి సమీపంలో ఉన్న మొదటి ర్యాంకును సైతం అర్జున్ గారు సాధించగలరని సీఎం గారు ఆశాభావం వ్యక్తం చేశారు.
చెన్నై గ్రాండ్ మాస్టర్స్ చెస్ టోర్నీలో 3వ రౌండు విజయంతో లైవ్ చెస్ రేటింగ్ లో 2805.8 పాయింట్లు సాధించిన Arjun Erigaisi వరల్డ్ నంబర్ 2 స్థానానికి ఎగబాకారు. 2831.0 పాయింట్లతో నార్వే దేశానికి చెందిన మాగ్నస్ కార్ల్‌సన్ అగ్రస్థానంలో కొనసాగుతున్నారు..