భారత్ న్యూస్ విశాఖపట్నం..మారిపోతున్న వివాహ
సాంప్రదాయాలు..!!
పెళ్ళికి వెళ్ళామా ? కాబోయే దంపతులకు మొహం చూపించామా ? క్యూలో నుంచానమ్మా ? ఇవ్వాలనుకున్న Gift ఇచ్చామా? ఆసమయములో పెళ్ళి వారికి దయ కలిగి ఓ ఫోటో అంటే ? ఆ సమయములో ఫోటో గ్రాఫర్ ఉంటే ఫోటో తీయించుకున్నామా ?అవకాశం దొరికితే ప్లేట్లు పట్టుకుని ఒకళ్ళ నొకళ్ళు తోసుకుని బఫే భోజనము చేసామా ? తిరిగి మన ఇంటికి చేరుకున్నామా ?
అంతే.
వివాహ కార్యక్రమమా ? జీలకర్ర బెల్లమా ? మాంగల్యధారణా ? తలంబ్రాలా ?
అంటే ఏమిటి ?
అవన్నీ మనకెందుకు ?
వివాహ ముహూర్తం రాత్రి పది తర్వాత అయితే, స్నేహితులు, బంధువులు భోజనాలు అవ్వగానే ముహూర్తానికి ఉండకుండా మాయమవుతున్నారు. భోజనాలు చేసేవారు వెయ్యి మంది ఉంటే, ముహూర్తానికి వందమంది కూడా ఉండటం లేదు .
Function Hall లు వివాహ సమయానికి జనాలు లేక వెల వెల బోతున్నాయి. అర కొర ముఖ్యమైన బంధువులు తప్పదురా భగవంతుడా అన్నట్లు నిద్రతో జోగుతూ తూలుతూ ఉంటున్నారు.
కొందరు పెళ్ళికి పిలిచేటప్పుడే ముఖ్యమైన వారికి ఇవ్వవలసిన రిటర్న్ గిఫ్ట్ లు వారి ఇంటి దగ్గరే ముందే ఇచ్చేస్తున్నారు.
వివాహానికి వచ్చిన వారు కూడా పెళ్ళికి ముందే ఏర్పాటు చేస్తున్న రిసెష్షన్ టైములో వారివ్వదల్చుకున్నది వారి చేతిలో పెట్టేసి, ఆ భోజనము కానిచ్చేసి కంటికి కనపడకుండా మాయమవుతున్నారు.
మారుతున్న కాలంతో పాటు అందరూ మారాలేమో ?
వివాహం నూతన వధూవరులను ఆశీర్వదించడం ఈ రోజుల్లో ముఖ్యం కాదు.
వెళ్ళామా లేదా ?
సమర్పించుకున్నామా లేదా ?
ఫోటోలో ఒక్కసారి క్లిక్ అయి హాజరు అయినట్లు నిరూపించుకుంటే చాలు.
ఈ మధ్యనే ఒక వివాహానికి వెళ్ళాను.
వివాహం పూర్తి కాకుండానే జీలకర్ర బెల్లం తంతు పూర్తికాగానే మాంగల్యధారణ కూడా జరగకుండానే ఎవరో తరుముకొస్తున్నట్లుగా కనీసం ఎవరూ పిలవకుండానే అందరూ భోజనాలకి పరిగెత్తుతున్నారు.
తాపీగా కూర్చుని పెళ్ళి చూస్తున్న నా దగ్గరకి నా స్నేహితుడు వచ్చి ” పద పద ఏమిటి అలాగే కూర్చున్నావు ? కాసేపు ఆగితే ఆకులే తినటానికి మిగిలేది ” అంటూ నన్ను కూడా లాక్కెళ్ళాడు.
భోజనాలు బఫేలు. వెళ్ళగానే స్టార్ హొటల్స్ లో ఇచ్చినట్లు మెనూ కార్డు చేతిలో పెట్టారు.
తీరా మెనూకార్డు చూసాక కళ్ళు బైర్లు కమ్మాయి. 58 ఐటమ్స్ .అందులో 8 రకాల స్వీట్స్. 3 ఫ్రై కూరలు. 3 మామూలు కూరలు. ఇంకా ఎన్నెన్నో రకరకాలు. విపరీతమైన వృథా జరిగింది. గబా గబా వడ్డించేసుకుని అలా పారేస్తుంటే తిండి కూడా సయించలేదు.