
పాకిస్తాన్ లోని ఉగ్రవాదులకు కాశరాత్రి చూపించింది ఇండియన్ ఆర్మీ. త్రివిధ దళాల సమన్వయంతో చెలరేగి ఆపరేషన్ సిందూర్ సక్సెస్ చేసింది. ఇందుకోసం ఆత్యాధునిక ఆయుధాలను బయటకు తీసింది. ఆత్మాహుతి డ్రోన్లు, స్కాల్ప్ క్షిపణులతో పాటు హ్యామర్ బాంబులు కూడా వాడినట్లు తెలుస్తోంది. వాస్తవానికి మిలటరీ యాక్షన్ సమయంలో ఏ ఆయుధాలు వాడిందీ బయటకు చెప్పరు.
కానీ దాడి తర్వాత జరిగిన విధ్వంసాన్ని పరిగణనలోకి తీసుకుని ఆయుధాలు ఏం వాడారో అర్థం అవుతుంది. ముఖ్యంగా కదులుతున్న లక్ష్యాలను బ్లాస్ట్ చేయడానికి లాయిటరింగ్ మ్యూనిషన్ టెక్నాలజీ డ్రోన్లు వినియోగించినట్లు తెలుస్తోంది. వీటికి నిఘా సామర్ధ్యం ఎక్కువగా ఉండటం వల్ల టార్గెట్ ఏమాత్రం మిస్ కాదు. ఇక స్కాల్ప్ క్షిపణులను స్ట్రామ్ షాడో అని కూడా అంటారు. ఫ్రాన్స్ అభివృద్ధి చేసిన ఈ మిస్సైల్ దాదాపు 250 కిలో మీటర్ల దూరంలోని లక్ష్యాలను బ్లాస్ట్ చేస్తుంది. ఈ క్షిపణులను రఫెల్ విమానాల నుంచి ప్రయోగించినట్లు తెలుస్తోంది. ఇక బహుళ అంతస్తుల భవనాలు, బంకర్లను ధ్వంసం చేసేందుకు హ్యామర్ బాంబులను వాడినట్లు అంచనా వేస్తున్నారు.
మన సరిహద్దుకు అవతల 30 కిలో మీటర్ల దూరంలో ఉన్న లష్కర్ హెడ్ క్వార్టర్ అయిన మర్కాజ్ తోయిబా భవనాన్ని హ్యామర్ బాంబులతో ధ్వంసం చేసినట్లు తెలుస్తోంది. అలాగే అతిపెద్ద ఉగ్ర స్థావరాలైన బవహల్పూర్, ముర్కిదేలను ధ్వంసం చేసే బాధ్యత వాయుసేన తీసుకున్నట్లు నిపుణులు అంచనా వేస్తున్నారు. ఇక మిగిలిన వాటి సంగతి ఆర్మీ తీసుకుంటే, నౌకాదళం తన నిఘా వ్యవస్థలైన పీ ఎయిట్ ఐ విమానాలు, ఎంక్యూ నైన్ డ్రోన్లతో సహకారం అందించింది.