భారత్ న్యూస్ ఢిల్లీ…కేంద్ర రైల్వే బోర్డు ఛైర్మన్ సతీష్ కుమార్ గారిని కలిసిన వరంగల్ ఎంపీ డాక్టర్ కడియం కావ్యగారు

కాజీపేటలో నూతన బస్టాండ్ ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేసిన ఎంపి

కాజీపేట రైల్వే స్టేషన్ సమీపంలోని ఖాళీగా ఉన్న 1ఎకరం రైల్వే భూమిని TSRTC బస్టాండ్ నిర్మాణానికి కేటాయించాలని అభ్యర్థించిన ఎంపి

తక్షణమే స్పందించిన కేంద్ర రైల్వే బోర్డు ఛైర్మన్ సతీష్ కుమార్

సౌత్ సెంట్రల్ జిఎం గారితో ఫోన్ లో మాట్లాడి కాజీపేట రైల్వే బస్టాండ్ నిర్మాణ దిశగా చర్యలు చేపట్టాలని ఆదేశించారు.

తమ సమక్షంలోనే కేంద్ర రైల్వే బోర్డు ఛైర్మన్ సానుకూలంగా స్పందించడం పట్ల హర్షం వ్యక్తం చేసిన ఎంపీ

కాజీపేటలో రైల్వే జంక్షన్ ను రైల్వే డివిజన్ ఏర్పాటు చేయాలని కోరిన ఎంపీ డా. కడియం కావ్య.

కొత్తగా ప్రతిపాదించిన నష్కల్ నుండి చింతలపల్లి, నష్కల్ నుండి హాసన్ పర్తి గూడ్స్ లైన్ నిర్మాణంపై పునరాలోచించాలని కోరారు.

కేంద్ర రైల్వే బోర్డు ఛైర్మన్ సతీష్ కుమార్ గారిని వరంగల్ పార్లమెంట్ సభ్యురాలు డాక్టర్ కడియం కావ్య గారు మర్యాదపూర్వకంగా కలిసారు.కాజీపేట ఆవరణలో నూతన బస్ స్టాండ్ నిర్మాణం కోసం స్థలం కేటాయించాలని కోరుతూ వినతి పత్రం అందజేశారు. విస్తృతమైన రైల్వే కనెక్షన్‌లలో కీలకమైన కాజీపేట జంక్షన్ ప్రతిరోజూ వేలాది మంది ప్రయాణికులకు సేవలు అందిస్తుందని తెలిపారు. ప్రయాణికులు రైలు ప్రయాణాల తర్వాత వారి గ్రామాలకు చేరుకోవడానికి RTC బస్సులపై ఆధారపడతారని, ఇక్కడ నూతన బస్టాండ్ ఏర్పాటు చేస్తే వ్యాపారవేత్తలు, ఉద్యోగులు, విద్యార్థులు మరియు చిన్న తరహా పరిశ్రమల వారి రోజువారీ ప్రయాణానికి చాలా ఉపయోగకరంగా ఉంటుందని తెలియజేసారు. ఇటీవల వరంగల్ పశ్చిమ శాసనసభ్యులు నాయిని రాజేందర్ రెడ్డి గారు మరియు స్థానిక ప్రజా ప్రతినిధులు, ADRM, జిల్లా కలెక్టర్, మున్సిపల్ అధికారులు మరియు RTC రీజనల్ మేనేజర్‌తో కలిసి కాజీపేట రైల్వేస్టేషన్ సమీపంలో ఖాళీగా ఉన్న రైల్వే భూమిని గుర్తించడం జరిగిందని పేర్కొన్నారు. కాజీపేటలో బస్ స్టేషన్ నిర్మాణానికి కూడా రాష్ట్ర ప్రభుత్వం నిధులు ఇవ్వడానికి సిద్ధంగా ఉందని తెలిపారు. కాజీపేట బస్టాండ్ నిర్మాణానికి కాజీపేట రైల్వే స్టేషన్ సమీపంలో ఉన్న 1ఏకార రైల్వే భూమిని TSRTC కి కేటాయించాలని ఈ సందర్భంగా విజ్ఞప్తి చేశారు.

కొత్తగా ప్రతిపాదించిన నష్కల్ నుండి చింతలపల్లి, నష్కల్ నుండి హసన్ పర్తి గూడ్స్ లైన్ నిర్మాణంపై పునరాలోచించాలని కోరారు. ఈ కొత్త లైన్ నిర్మాణం చేపడితే రైతులు తీవ్ర ఇబ్బందులు పడతారని పేర్కొన్నారు.

సౌత్ సెంట్రల్ రైల్వేకు ముఖ ద్వారంగా ఉన్న కాజీపేట రైల్వే జంక్షన్ ను రైల్వే డివిజన్ గా అప్ గ్రేడ్ చేయాలని ఎంపీ డా. కడియం కావ్య గారు కోరారు. రైల్వే డివిజన్ ఏర్పాటుతో వ్యాపార వర్గాలకు మాత్రమే కాకుండా, కాజీపేటలో డివిజనల్ ప్రధాన కార్యాలయంగా ఉన్న ఈ ప్రాంతంలోని రైల్వే ఉద్యోగులందరికీ ఎంతగానో ఉపయోగపడుతుందని వివరించారు. ఈ సందర్భంగా పై అంశలపై కేంద్ర రైల్వే బోర్డు ఛైర్మన్ సతీష్ కుమార్ దృష్టి కి తీసుకురాగానే తక్షణమే స్పందించిన చైర్మన్ సౌత్ సెంట్రల్ జిఎం తో ఫోన్ లో మాట్లాడి కాజీపేట రైల్వే బస్టాండ్ నిర్మాణ దిశగా చర్యలు చేపట్టాలని ఆదేశించారు. తమ సమక్షంలోనే కేంద్ర రైల్వే బోర్డు ఛైర్మన్ సానుకూలంగా స్పందించడం పట్ల ఎంపీ హర్షం వ్యక్తం చేస్తూ కాజీపేట ఆర్టీసీ బస్టాండ్ నిర్మాణం వేగవంతం అవుతుందని విశ్వాసం కలిగిందని ఎంపీ డాక్టర్ కడియం కావ్య వివరించారు…..