పాకిస్థాన్ భూభాగంపై ఉన్న ఉగ్ర‌వాద స్థావ‌రాల‌ను, శిక్ష‌ణ శిబిరాలే ల‌క్ష్యంగా భార‌త సైన్యం, వైమానిక ద‌ళాలు చేప‌ట్టిన ఆపరేషన్ సిందూర్‌

భారత్ న్యూస్ ఢిల్లీ…..పాకిస్థాన్ భూభాగంపై ఉన్న ఉగ్ర‌వాద స్థావ‌రాల‌ను, శిక్ష‌ణ శిబిరాలే ల‌క్ష్యంగా భార‌త సైన్యం, వైమానిక ద‌ళాలు చేప‌ట్టిన ఆపరేషన్ సిందూర్‌ ను జీర్ణించుకోలేని పాకిస్థాన్‌.. మనదేశం మీదకు క్షిపణులు, డ్రోన్లు ప్రయోగించి రెచ్చగొట్టే చర్యలకు పాల్పడిన సంగతి తెలిసిందే.

ఆపరేషన్‌ తర్వాత అక్కసుతో పంజాబ్‌లోని అమృత్‌సర్‌లో ఉన్న ప్ర‌ఖ్యాత‌ స్వర్ణ దేవాలయాన్ని లక్ష్యంగా చేసుకుందని మేజర్ జనరల్ కార్తిక్‌ సి శేషాద్రి వెల్లడించారు.

వాటిని సమర్థవంతంగా తిప్పికొట్టామని తెలిపారు.