హైదరాబాద్‌కు కేంద్రం గుడ్ న్యూస్: 2000 ఎలక్ట్రిక్ బస్సులు కేటాయింపు

…భారత్ న్యూస్ హైదరాబాద్….హైదరాబాద్‌కు కేంద్రం గుడ్ న్యూస్: 2000 ఎలక్ట్రిక్ బస్సులు కేటాయింపు

హైదరాబాద్‌కు 2,000 ఎలక్ట్రిక్ బస్సుల కేటాయింపు

పీఎం ఈ-డ్రైవ్ పథకంలో భాగంగా కేంద్రం నిర్ణయం

కేంద్ర భారీ పరిశ్రమల శాఖ మంత్రి కుమారస్వామి వెల్లడి

దేశవ్యాప్తంగా ఐదు నగరాలకు మొత్తం 14,028 బస్సులు

రెండేళ్లలో రూ.10,900 కోట్ల ఆర్థిక కేటాయింపు

ఈ-ఆంబులెన్స్‌లు, ఈ-ట్రక్కులకు కూడా నిధులు

హైదరాబాద్ నగర ప్రజలకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. పర్యావరణ హితమైన ప్రజారవాణాను ప్రోత్సహించే దిశగా చేపట్టిన పీఎం ఈ-డ్రైవ్ పథకం కింద నగరానికి 2,000 ఎలక్ట్రిక్ బస్సులను కేటాయించినట్లు కేంద్ర భారీ పరిశ్రమల మంత్రిత్వ శాఖ గురువారం ప్రకటించింది. ఈ నిర్ణయంతో హైదరాబాద్‌లో ప్రజా రవాణా వ్యవస్థ మరింత బలోపేతం కావడంతో పాటు, కాలుష్య నియంత్రణకు కూడా దోహదపడనుంది.

కేంద్ర భారీ పరిశ్రమల శాఖ మంత్రి హెచ్.డి. కుమారస్వామి అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఎలక్ట్రిక్ బస్సుల కేటాయింపుపై ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ సమావేశంలో తెలంగాణ, కర్ణాటక, ఢిల్లీ, గుజరాత్ రాష్ట్రాలపై ప్రధానంగా దృష్టి సారించారు. పథకం ప్రస్తుత దశలో బెంగళూరుకు సుమారు 4,500, ఢిల్లీకి 2,800, అహ్మదాబాద్‌కు 1,000, సూరత్‌కు 60