.భారత్ న్యూస్ అమరావతి..వరుణ్‌తేజ్‌ వెడ్డింగ్‌ వీడియో వైరల్‌

వరుణ్‌తేజ్‌- లావణ్య త్రిపాఠి వివాహ బంధంలోకి అడుగుపెట్టి ఏడాది పూర్తయింది. ఈ సందర్భంగా తన సతీమణికి శుభాకాంక్షలు తెలియజేస్తూ స్పెషల్‌ ఫొటోను శుక్రవారం సాయంత్రం పోస్ట్‌ చేశారు వరుణ్‌. మరోవైపు, ‘ది హౌస్‌ ఆన్‌ ది క్లౌడ్స్‌’ సంస్థ వరుణ్‌- లావణ్యల వెడ్డింగ్‌ వీడియోను విడుదల చేసింది. అందులో చిరంజీవి, పవన్‌ కల్యాణ్‌ తదితరులు కనిపించారు. చరణ్‌తో బన్నీ డ్యాన్స్‌ చేశారు. ఈ వీడియోలో ప్రస్తుతం వైరల్‌గా మారింది.