..భారత్ న్యూస్ అమరావతి..హీరో నార్నే నితిన్‌ నిశ్చితార్థం వేడుకలో ఎన్టీఆర్‌ సందడి

నార్నే నితిన్‌ నిశ్చితార్థం ఇవాళ హైదరాబాద్‌లో ఘనంగా జరిగింది. ఈ వేడుకలో ఎన్టీఆర్‌, ఆయన సతీమణి లక్ష్మీ ప్రణతి, తనయులు అభయ్‌, భార్గవ్‌తోపాటు కల్యాణ్‌రామ్‌, వెంకటేశ్‌ తదితరులు సందడి చేశారు. కాబోయే వధూవరులను ఆశీర్వదించారు. ప్రముఖ పారిశ్రామికవేత్త నార్నే శ్రీనివాసరావు తనయుడు, ఎన్టీఆర్‌ బావ మరిదిగా నితిన్‌ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టారు. 2023లో విడుదలైన ‘మ్యాడ్‌’తో ఆయన ప్రేక్షకులకు పరిచయం అయ్యారు. తాజాగా ‘ఆయ్‌’తో అలరించారు.