.భారత్ న్యూస్ హైదరాబాద్….హైటెక్‌సిటీ మెడికవర్ హాస్పిటల్‌లో దారుణం
అనారోగ్యంతో మెడికవర్ హాస్పిటల్‌కు వచ్చిన జూనియర్ డాక్టర్ నాగప్రియ చికిత్స పొందుతూ మృతి.
వైద్యం కోసం ఇప్పటి వరకు మూడు లక్షలకు పైగా డబ్బులు కట్టిన కుటుంబ సభ్యులు.
ఇంకో 4లక్షలు కడితేనే మృతదేహం ఇస్తామంటున్న ఆస్పత్రి సిబ్బంది.. ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ చెప్పినా వినని వైనం.
నిన్న అర్ధరాత్రి మూడు లక్షలు కట్టాలని, లేదంటే వైద్యం ఆపేస్తామని కుటుంబసభ్యులకు ఫోన్ చేసిన హాస్పిటల్ సిబ్బంది.
ఉదయం లక్ష కట్టిన తరువాత పేషంట్ మృతి చెందిందని తెలిపిన హాస్పిటల్ సిబ్బంది.
వైద్యం ఆపేయడం వల్లే నాగప్రియ చనిపోయిందని ఆరోపిస్తున్న కుటుంబ సభ్యులు…