…భారత్ న్యూస్ హైదరాబాద్…మహిళకు పురుడు పోసిన 108 సిబ్బంది…

TG: మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా కుషాయిగూడకు చెందిన ఓ మహిళకు పురిటి నొప్పులు రావడంతో కుటుంబ సభ్యులు 108ను ఆశ్రయించారు.
అక్కడకు చేరుకున్న 108 సిబ్బంది ఈఎంటీ శ్రీకాంత్, నజీరుద్దీన్ గాంధీ ఆసుపత్రికి బయలుదేరారు. నొప్పులు ఎక్కువవడంతో 108 లోనే చికిత్స అందించి పురుడు పోశారు. ప్రస్తుతం తల్లి బిడ్డా క్షేమంగానే ఉన్నారు. చికిత్స అందించి ప్రాణాలు కాపాడిన సిబ్బందికి మహిళ కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు..