సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులపై మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సమీక్ష..

భారత్ న్యూస్ హైదరాబాద్….సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులపై మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సమీక్ష..

హాజరైన ఆర్ అండ్ బీ శాఖ ఉన్నతాధికారులు వికాస్ రాజ్, హరిచందన, వైద్య ఆరోగ్య శాఖ కార్యదర్శి క్రిస్టినా

ఆసుపత్రుల నిర్మాణం ఆలస్యం అవుతుండటంపై మంత్రి అసహనం

కాంట్రాక్టర్లతో పనిచేయించడం కూడా రాదా అంటూ మండిపాటు

సనత్ నగర్ ఆసుపత్రిని జూన్ 2న ప్రారంభించాలని టార్గెట్ పెట్టుకున్నా, పనులు ఎందుకు వేగంగా సాగడం లేదని అధికారులను ప్రశ్నించిన మంత్రి

సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులు నిర్మాణం పూర్తి చేస్తారో టెక్నికల్ గా అంచనా వేసి రిపోర్ట్ ఇవ్వాలని కోమటిరెడ్డి ఆదేశం