
కొంతమందికి జ్యూస్ లు అంటే మామిడి, పుచ్చకాయ.. ఇవే గుర్తొస్తాయి. అదీ వేసవిలో సీజనల్ గా దొరికేవిగా మాత్రమే తెలుసు.. కానీ మనం రోజూ తినే కూరగాయలతోనూ రకరకాల జ్యూస్ లు చేసుకోవచ్చు. ఎండలో ఎక్కువసేపు ఉండేవారికి చర్మ సంబంధిత ఇబ్బందులు వస్తాయి. వీటిని నివారించి, చర్మం లోపల నుంచి కాంతివంతంగా, హైడ్రేట్ గా ఉంచడానికి మీ ఆహారంలో చేర్చుకోవాల్సిన 5 రకాల జ్యూస్ లను ఈరోజు మనం తెలుసుకుందాం:
- బీట్రూట్ రసం: రక్తాన్ని శుద్ధి చేస్తుంది. దీంతో మీ చర్మం ప్రకాశవంతంగా మారడమే కాక ఆరోగ్యంగా ఉంచడంలో కీలకంగా పని చేస్తుంది. బీట్రూట్లో విటమిన్ సి కూడా పుష్కలంగా ఉంటుంది. ఇది మొహంపై మచ్చలను తొలగించడంలో సహాయపడుతుంది. సహజమైన మెరుపును ఇస్తుంది.
- దోసకాయ రసం: దోసకాయ రసంలో విటమిన్ కె, సి, మెగ్నీషియం, పొటాషియం, బి-6, ఫోలేట్, ఐరన్, సిలికా, కాల్షియం, జింక్ వంటి పోషకాలు పుష్కలంగా ఉంటాయి. శరీరాన్ని హైడ్రేటెడ్‌గా ఉంచుతుంది.
- టమోటా రసం: టానింగ్ ను తగ్గించేందుకు, ఓపెన్ ఫోర్స్ ను రిపేర్ చేయడంలో హెల్ప్ చేస్తుంది. జిడ్డులా ఉన్న చర్మంలో సెబమ్ స్రావాన్ని నియంత్రించి, ఫేస్ క్లీన్ గా ఉండేలా చేస్తుంది.
- పుదీనా రసం: చాలామందికి సొరకాయ జ్యూస్ తినడం ఇష్టం ఉండదు. కానీ తాజా సొరకాయను తీసుకోవడం వల్ల చర్మం రిఫ్రెషింగ్ గా ఉంటుంది.ఈ జ్యూస్ తయారీలో ఒట్టి సొరకాయను కాకుండా కొన్ని పుదీనా ఆకులు, ఉసిరి, అల్లం, రాతి ఉప్పు వేసి జ్యూస్ లా చేసుకొని తాగడం వల్ల బెస్ట్ రిజల్ట్ ఉంటుంది.
- క్యాబేజీ, దోసకాయ రసం: క్యాబేజీ రసం మీ చర్మ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. ఇందులో విటమిన్ సి, కె, యాంటీఆక్సిడెంట్లు ఉండటం వల్ల చర్మాన్ని ఫ్రీ-రాడికల్ నుంచి రక్షిస్తాయి.