ఆ వాటర్ మీ ఇంట్లోనే చేసుకోండి …

చిన్నపిల్లలు ఆహారం తినటానికి చాలా మారం చేస్తూ ఉంటారు. సంవత్సరంలోపు పిల్లలకి మనం మామూలుగా అలవాటుపడే వుడ్ వర్డ్స్ వాటర్ ని పడుతూ ఉంటాం. అది చాలా వరకు మేలని డాక్టర్స్ కూడా ప్రిస్క్రైబ్ చేస్తూ ఉంటారు. ఆ వాటర్ ని మనం ఇంట్లోనే హాయిగా తయారు చేసుకోవచ్చు. చిటికెడు పంచదార ,చిటికెడు జీలకర్ర పొడి ,చిటికెడు వాము ,చిటికెడు ఉప్పు ఇవి సమపాళ్లలో తీసుకొని 2 నుండి 3 చుక్కల ఆముదం లీటరు నీళ్లో మరిగించాలి. బాగా మరిగిన ఈ ద్రవాన్ని వడకట్టి, చల్లారిన తర్వాత 6 నెలల పిల్లల నుండి 5 సంవత్సరాల వరకు హాయిగా పట్టించవచ్చు. ఆరోగ్యానికి ఆరోగ్యం ఆనందానికి ఆనందం. ఇక నుండి ప్రయత్నిస్తారా మరి ఈ చిట్కాని.